Wednesday, January 8, 2025

రైతు భరోసా పై స్పీడ్‌ పెంచండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : జనవరి 26 నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమ లు చేయనున్న రైతుభరోసా పథకానికి సంబంధించిన చర్యలను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిన విధంగా ఈ యాసంగి నుండి వ్యవసాయానికి అనువైన భూములన్నంటికి రైతుభరోసా వర్తింపచేసి, వ్యవసాయయోగ్యం కాని భూములను గుర్తించేందుకు సాంకేతికతను వాడుకోవాలన్నారు. మంత్రి వి విధ సాంకేతికత కంపెనీల ప్రతినిధులతో మా ట్లాడి వ్యవసాయ యోగ్యంకాని భూముల వర్గీకరణను, మండలాల వారిగా, గ్రామాల వారి గా భూముల విస్తీర్ణాలు, సర్వే నెంబర్లవారిగా సమర్పించడానికి వారి వద్దగల సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కూడా రెవి న్యూ, వ్యవసాయశాఖ వారి సేవలు వినియోగించుకుని, గ్రామాల వారిగా సర్వే చేసి అట్టి భూములను నిర్ధారణ చేయాలని నిర్ణయించిన ట్లు తెలిపారు. వ్యవసాయ, అనుబంధరంగా ల బడ్జెట్ ప్రతిపాదనలు పథకాల పురోగతిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షలో భాగంగా మంత్రి ఈ సంవత్స రం ఇప్పటిదాకా అమలు చేసిన పథకాల వివరాలు, రానున్న 3 నెలల ప్రణాళిక, వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం ప్రతిపాదించిన పథకాలు, కేంద్ర ప్రభుత్వ వాటా గురించి వ్యవసాయ శా ఖ సంచాలకులు గోపి, ఉధ్యానశాఖ సంచాలకులు యాస్మిన్ బాషా, మార్కెటింగ్, కోఆపరేటివ్ సంచాలకులు ఉదయ్ కుమార్ వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నదో అధికారులు గమనించాలని, దానిని బట్టి రాష్ట్రస్థాయి నుండి గ్రామస్థాయి వరకు ఉన్న అధికారులు నిర్లిప్తత వీడి తదనుగుణంగా పనిచేయాలని హితవు పలికారు. ప్రజాప్రతినిధుల నుండి వచ్చే విజ్ఙప్తులను పెండింగ్ లో పెట్టడం మంచి పద్ధతి కాదని, వాటిని వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని, ఒకవేళ అది వారి పరిధిలోనికి రాకపోయినా, ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం లేకపోయినా ఈ విషయాన్ని ప్రజాప్రతినిధికి తెలియ చేయాల్సిన బాధ్యత అధికారులదే అని స్పష్టం చేశారు.

ముఖ్యంగా మార్కెటింగ్ లో మార్కెట్ కమిటీల పునర్విభజనకు వస్తున్న ప్రతిపాదనలు దీర్ఘకాలం పెండింగ్ లో పెట్టడంపై మార్కెటింగ్ కార్యాలయ ఉన్నతోద్యోగిపై అసహనం వ్యక్తం చేసి మూడు రోజుల్లో అన్ని విజ్ఙప్తులను పరిశీలించి రిపోర్టు పంపించాలని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఉదయ్ కుమార్‌ని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రభుత్వ ప్రాధాన్యత తెలుసుకుని పనిచేయాలని హితవు పలికారు. రైతులు, ప్రజా ప్రతినిధుల, మంత్రి నుండి వచ్చే విజ్ఞప్తులపై సత్వరమే పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. పరిష్కారంలో జాప్యంపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News