Wednesday, January 15, 2025

నా రాజకీయ జీవితం తెరచిన పుస్తకం: తుమ్మల

- Advertisement -
- Advertisement -

ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మంత్రి తుమ్మల

మన తెలంగాణ / హైదరాబాద్: తన రాజకీయ జీవితం గురించి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అభ్యంతరకరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎంపీకి మంత్రి తుమ్మల సుధీర్ఘమైన లేఖ రాశారు. నిజామాబాద్ రైతుల సుదీర్ఘ పోరాటం, చిరకాల నిరీక్షణ తర్వాత కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేయడం హర్షిణీయమని, వ్యవసాయ శాఖ మంత్రిగానే కాక, ఒక రైతుగా నాకు ఎంతో ఆనందాన్ని కలిగించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశానని తెలిపారు.

1983 నుండి ఈ నాటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న తాను ఏనాడూ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టలేదని స్పష్టం రాష్ట్ర అభివృద్ధి, రైతులు సంక్షేమం, పేదల పక్షపాతం తప్ప తనకు మరో ఎజెండా లేదన్నారు. నా రాజకీయ జీవితం, నా వ్యక్తిత్వం గురించి మీ పార్టీ సీనియర్ నాయకులు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అడిగి తెలుసుకోండి. ముఖ్యమంత్రులు ఎవరైనా, వారి సహకారంతో రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేశాను.

జైకా నిధులతో ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటులోనూ తన పాత్ర ఉందన్నారు. రాష్ట్రంలో నిర్మించిన అన్ని రహదారులు, నీటిపారుదల ప్రాజెక్టులు (కాళేశ్వరం మినహా) నా ప్రమేయం లేకుండా జరగలేదని వివరించారు. వ్యవసాయ శాఖ మంత్రి హోదాలో జాతీయ పసుపు బోర్డు సాధించుకోవడం నా బాధ్యతగా భావించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చానని, పసుపు బోర్డు ప్రకటించిన సందర్భంగా ప్రధాన మంత్రి గారికి ధన్యవాదాలు తెలిజేశాను. దీంట్లో మీకున్న అభ్యంతరం ఏమిటో అర్ధం కావడంలేదన్నారు. మీ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ… వాటిని మీ విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News