Sunday, December 22, 2024

నా వెనక ఎన్టీఆర్ ఉన్నారనే ధైర్యంతో ఆ ఎన్నికల్లో పోటీ: తుమ్మల

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమ్మేళనం లో తుమ్మల నాగేశ్వర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన గెలుపు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు అవుతుందని, తన గెలుపు కోసం మద్దతుగా నిలిచిన తెలుగుదేశం శ్రేణులకు జీవితాంతం రుణపడి ఉంటానని, భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధిలో తన భుజం మీద చెయి వేసి రాజకీయ జీవితం ఇచ్చిన పూజ్యులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని ప్రశంసించారు. భద్రాచలం నుంచి చర్ల వరకు ఆయన కారులో తీసుకెళ్లారని, కృష్ణా జిల్లా మీనవోలులో కలిసినపుడు సత్తుపల్లి నుంచి పోటీ చేయమని ఆశీర్వదించారని గుర్తు చేశారు.
తన జేబులో ఏమీ లేకపోయినా తన వెనుక ఎన్టీఆర్ ఉన్నారనే ధైర్యంతో ఎన్నికల్లో పోటీ చేశానని తుమ్మల వివరణ ఇచ్చారు.

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు తల ఎత్తుకుని ఉన్నారంటే ఆ మహాను భావుడు దీవెనలేనని, ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశానని వివరించారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష కోసం లక్షల మంది పార్టీ నేతలు కార్యకర్తల కోసం చంద్రబాబును ముఖ్యమంత్రి చేశామని, 1999 లో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం అధికారం లోకి వచ్చిందంటే ఎన్టీఆర్ ఇచ్చిన రాజకీయ చైతన్యం అని తుమ్మల ప్రశంసించారు. రాష్ట్ర విభజనతో ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం పార్టీ మారానని, గుండెల్లో బాధ దిగమింగుకొని పార్టీ మారానని, కానీ బిఆర్ఎస్ అరాచక అవినీతి పాలన తరమి కొట్టాలని కాంగ్రెస్ పార్టీలో చేరానని వివరించారు. తెలుగుదేశం శ్రేణులు తనకు మద్దతుగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు అంటే ఎన్టీఆర్ ఆశీర్వాదం అని కొనియాడారు. ఖమ్మంలో అరాచక అవినీతి పాలన తరమి కొట్టాలి కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని తుమ్మల పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News