Monday, January 20, 2025

వైరల్ : ఒక్క వాక్యంలో బిఆర్‌ఎస్‌కు తుమ్మల రాజీనామా..

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన రాజీనామా లేఖను పంపారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. ‘ఇన్నాళ్లూ మీరు అందించిన సహకారానికి ధన్యవాదాలు… పార్టీకి నా రాజీనామాను ఆమోదించవచ్చు’ అని తుమ్మల ఒక్క వాక్యంలో రాజీనామా లేఖను ముగించారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరడం ఖాయం. శనివారం హైదరాబాద్‌కు రానున్న ఏఐసీసీ అధినేత్రి సోనియా, రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సీడబ్ల్యూసీ సమావేశాల ప్రారంభానికి ముందు మధ్యాహ్నం 2 గంటలకు తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. తుమ్మలను కాంగ్రెస్ లోకి తీసుకురావాలని ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కానుగులు నేతృత్వంలో అధిష్టానం గత కొంతకాలంగా సమాలోచనలు జరుపుతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, పీసీసీ ప్రచార కమిటీ కో-కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నివాసానికి వేర్వేరుగా వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. తుమ్మలతో సునీల్ కానుగులుకు ఉన్న పరిచయం వెలుగులోకి రావడంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిరావు ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి తదితర నేతలు హైదరాబాద్‌లోని తుమ్మల నివాసానికి వెళ్లి ఆయనను అధికారికంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. శనివారం మంచిరోజు కావడంతో సోనియాగాంధీ సమక్షంలో చేరిక కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రతిపాదించగా, తుమ్మల కూడా అందుకు అంగీకరించినట్లు సమాచారం.

Tummala Nageswara Rao's resignation letter

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News