Wednesday, November 6, 2024

పువ్వాడ అఫిడవిట్ సరైన ఫార్మెట్ లో లేదు: తుమ్మల

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: ఎన్నికల సంఘానికి తుమ్మల నాగేశ్వర్ రావు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం సూచించిన ఫార్మెట్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ అఫిడవిట్ సమర్పించలేదన్నారు. రిటర్నింగ్ అధికారికి తుమ్మల లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. అఫిడవిట్‌లో డిపెండెంట్ కాలమ్ మార్చారని తుమ్మల ఆరోపణలు చేశారు. నాలుగు సెట్ల నామినేషన్లలో తప్పులు ఉన్నాయని, సరైన ఫార్మెట్‌లో లేకపోతే నామినేషన్ రిజక్ట్ చేయాలని రిటర్నింగ్ అధికారులను కోరారు. ఆర్‌ఒపై న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు. ఆర్‌ఒ ఎన్నికల నిబంధనలు పాటించడంలేదని తుమ్మల దుయ్యబట్టారు.

తుమ్మల దర్మంగా పోరాటం చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సవాల్ విసిరారు. ఎన్నికల్లో ధైర్యంగా పోరాటం చేసి గెలవాలని, గతంలో తనపై కేసు పెట్టి ఓటమి పాలయ్యారని చురకలంటించారు. తుమ్మల ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. తన నామినేషన్ తిరస్కరించాలనడం హాస్యాస్పదం అని మండిపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News