Wednesday, January 8, 2025

మెదడు, వెన్నులో కణితి ప్రాణాంతకం

- Advertisement -
- Advertisement -

మెదడు, వెన్నులో పెరిగే కణితిని గ్లియోబ్లాస్టోమా మల్టీఫార్మే ( glioblastoma multiforme ) అని అంటారు. ఇది ఎందుకు పెరుగుతుందో ప్రాథమిక కారణాలు తెలియవు. అలాగే దీన్ని నయం చేసే సరైన చికిత్సలేదు. దీని తీవ్రతను తగ్గించడానికి, రోగి జీవిత కాలాన్ని పొడిగించడానికి వైద్యం పరంగా కృషి చేస్తుంటారు ఈ కణితి వేగంగా పెరుగుతుంది కాబట్టి నాడీ వ్యవస్థ పని తీరుపై తీవ్రమైన నొప్పి ఉంటుంది.

జరిగిన సంఘటనలు గుర్తుంచుకోవడం కష్టమౌతుంది. భావోద్వేగం అస్థిరంగా ఉంటుంది. అసంకల్పిత కదలికలు ఉంటాయి. వినికిడి, దృష్టి సమస్యలు ఉంటాయి. అలాగే మాట్లాడడంలో ఇబ్బందులు ఉంటాయి. తరచుగా మూర్ఛ పోతుంటారు. అలాగే మానసిక అవస్థలు ఎక్కువ మార్పులు వస్తుంటాయి. వికారంగా అనిపించి వాంతులు అవుతుంటాయి. విపరీతమైన తలనొప్పి వస్తుంటుంది. ఈ కణితి పెరగడానికి ప్రాథమిక కారణం తెలియదు కానీ, పర్యావరణం, జన్యుపరమైన , వృత్తి పరమైన ప్రమాదాలు ఈ కణితి పెరగడానికి దోహదం చేస్తుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఈ ప్రభావాలపై అధ్యయనాలు జరుగుతున్నాయి.

వైద్యులు రోగి ప్రతిచర్యలు, సమన్వయం, నొప్పి ప్రతిస్పందన, కండరాల బలం ఇవన్నీ ప్రాథమికంగా పరీక్షించిన తరువాత మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ ( mri) పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ ( pet) స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షలు నిర్వహించి మెదడు చిత్రాలు గ్రహిస్తారు. కణితి వాపు, అసాధారణ పెరుగుదలను గుర్తిస్తారు. కణితి నిర్ధారణకు అవసరమైతే జీవాణు (బయోప్సీ) పరీక్ష కూడా చేయవచ్చు. ప్రస్తుతానికి ఈ కణితి నివారణ చికిత్సలోమూడు ప్రధాన మార్గాలున్నాయి. 1. రేడియేషన్ థెరపీ, 2. కెమోథెరపీ, 3. శస్త్రచికిత్స. రేడియేషన్ థెరపీ ద్వారా కణితి కణాలను నాశనం చేయడానికి వీలవుతుంది. చుట్టుపక్కల కణజాలానికి ఎలాంటి నష్టం జరగకుండా నివారించవచ్చు.

కిమోథెరపీ ద్వారా క్యాన్సర్ కణాలు విపరీతంగా పెరిగిపోవడాన్ని నివారించడానికి మందులను వినియోగిస్తారు. ఈ మందులు నోటి ద్వారా, లేదా సూది మందుల ద్వారా రోగికి ఇస్తారు. అయితే ఈ మందులు వికారం, వాంతులు వంటి దుష్ప్రభావాలను కూడా సృష్టిస్తాయి. మెదడు నుంచి క్యాన్సర్ కణాలను తొలిగించడానికి కిమోథెరపీ, రేడియోథెరపీలతో కూడిన శస్త్ర చికిత్స ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News