Sunday, February 23, 2025

వరద ఉధృతికి కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేట్

- Advertisement -
- Advertisement -

కర్ణాటక హోస్పెటల్ లో తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోయింది. తుంగభద్ర నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో డ్యామ్ 19వ గేట్ కొట్టుకుపోయింది. దీంతో ఇప్పటి వరకు లక్ష క్యూసెక్కుల మేర నీరు వృథాగా పోయినట్లు తెలుస్తోంది.  వరద ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా కలుగుతోంది. తుంగభద్రలో వరద ఉధృతి తగ్గిన తర్వాత అధికారులు మరమ్మతులు చేపట్టనున్నారు.

షిమోగలో వర్షాలకు తుంగభద్ర డ్యామ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో తుంగభద్ర నుంచి సుంకేసుల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News