- Advertisement -
నజ్లా బౌడెన్ రామధనే
అల్జీరియా: టునీసియా అధ్యక్షుడు కైస్ సయూద్ దేశానికి తొలి మహిళా ప్రధానిగా ప్రొఫెసర్ నజ్లా బౌడెన్ రామధనే(63)ను నియమించారు. దేశాధ్యక్షుడు ఇదివరకటి ప్రధానిని తొలగించి, పార్లమెంటును రద్దు చేశారు. దాంతో పరివర్తన ప్రభుత్వానికి(ట్రాన్సిషనల్ గవర్నమెంటుకు) ప్రధానిగా ఆమె సారథ్యం వహించనున్నారు.
నజ్లా బౌడెన్ రామధనే కొద్ది మందికే తెలిసిన భూభౌతికశాస్త్ర ప్రొఫెసర్. విద్యా మంత్రిత్వశాఖలో ఆమె ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టులను అమలుచేసేవారు. అధ్యక్షుడు సయీద్ ఆశ్చర్యకరమైన రీతిలో ఆమె నియుక్తి నిర్ణయాన్ని తీసుకున్నారు. అంతేకాక వీలయినంత త్వరగా కొత్త క్యాబినెట్‌ను ఏర్పాటుచేయాలని ఆమెకు ఆదేశించారని అధ్యక్ష కార్యాలయం ప్రకటన ద్వారా తెలుస్తోంది.
- Advertisement -