Tuesday, January 21, 2025

సొరంగం కూలిన సంఘటన.. 40మంది కార్మికులు క్షేమం

- Advertisement -
- Advertisement -

ఉత్తరకాశి: ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగ మార్గం కూలిపోయి సుమారు 40 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. అయితే వారంతా క్షేమంగా ఉన్నారని అధికారులు సోమవారం వెల్లడించారు. బ్రహ్మఖల్‌ యమునోత్రి జాతీయ రహదారిపై సిల్కియారా నుంచి దండల్ గావ్ వరకు సొరంగ మార్గం నిర్మిస్తున్నారు. ఆదివారం ఉదయం సొరంగం ఒక్కసారి కూలిపోవడంతో 40 మంది కార్మికులు చిక్కుకుపోయారు.

శిథిలాలు పూర్తిగా కప్పేయడంతో వారు బయటకు రాలేక పోయారు. కేంద్ర, రాష్ట్ర డిశాస్టర్ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. శిధిలాల మధ్యనున్న కార్మికులు క్షేమంగా ఉన్నారని, వారికి ఆక్సిజన్, ఆహారం నీరు అందించడమౌతోందని, వాకీ టాకీ ద్వారా వారితో అనేక సార్లు సంప్రదిస్తున్నామని నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఐడిసిఎల్) డైరెక్టర్ అంశూ మనీష్ ఖాల్కో చెప్పారు. ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ థామీ, జిల్లా మెజిస్ట్రేట్ అభిషేక్ రుహేలా సొరంగం వద్దకు వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News