Thursday, January 23, 2025

జైష్ ఉగ్రవాదులు తవ్విన సొరంగం ఆచూకీ లభ్యం!

- Advertisement -
- Advertisement -

Jaish Tunnel found

జమ్మూ: జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఒక క్రాస్ బోర్డర్ సొరంగాన్ని గుర్తించామని, త్వరలో జరగనున్న అమర్‌నాథ్ యాత్రకు అంతరాయం కలిగించేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు వేసిన ప్రణాళికలను భగ్నం చేసినట్లు సరిహద్దు భద్రతా దళం పేర్కొంది. కాగా జమ్మూ ప్రాంతంలో అలర్ట్ ప్రకటించారు. బుధవారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్‌లోని సాంబాలోని చక్ ఫక్విరా సరిహద్దు ఔట్‌పోస్టు పరిధిలో 150 మీటర్ల పొడవైన సొరంగాన్ని గుర్తించినట్లు బిఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.”ఈ సొరంగాన్ని గుర్తించడంతో, రాబోయే అమర్‌నాథ్ యాత్రకు అంతరాయం కలిగించడానికి పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదుల యొక్క దుర్మార్గపు డిజైన్లను బిఎస్ఎఫ్-జమ్మూ విఫలం చేసింది” అని సరిహద్దు భద్రతా దళం డిఐజి- ఎస్ పిఎస్ సంధు తెలిపారు.

సొరంగం తాజాగా తవ్వబడింది, పాకిస్తాన్ వైపు నుండి తవ్వింది.  దీని ఓపెనింగ్ సుమారు 2 అడుగులు కాగా, సొరంగం నిష్క్రమణను పటిష్టం చేసేందుకు ఉపయోగించిన 21 ఇసుక బస్తాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 22న జమ్మూలోని సుంజ్వాన్ ప్రాంతంలో సిఐఎస్ఎఫ్ బస్సుపై దాడి చేసి, అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌ను హతమార్చిన తర్వాత భద్రతా దళాలు ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లను కాల్చిచంపిన దాదాపు పక్షం రోజుల తర్వాత ఈ సొరంగం గుర్తించడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News