Sunday, December 22, 2024

12 ఏళ్ల తర్వాత తెరుచుకున్న సరిహద్దులు

- Advertisement -
- Advertisement -

అంటాక్యా: టర్కీ, సిరియాలలో సంభవించిన భూకంపం కారణంగా దాదాపు 12 ఏళ్ల తర్వాత రెండు దేశాల మధ్య సరిహద్దులు తెరుచుకున్నాయి. ఐక్యరాజ్య సమితి చేసిన సూచనకు అంగీకరించిన సిరియా అధ్యక్షుడు బషర్‌అల్ అస్సాద్ రెండు దేశాల మధ్య సరిహద్దులను తెరవాలని ఆదేశించగానే అధికారులు వేగంగా స్పందించి టర్కీలోంచి సిరియాలోకి క్రాసింగ్‌లు ప్రారంభించారు. ఈ సరిహద్దులగుండా ఐక్యరాజ్యసమితి బృందాలు టర్కీలోంచి సిరియాలోకి సహాయక సామగ్రిని తీసుకు వచ్చేందుకు వీలు చిక్కింది. 2011లో సిరియాలో మొదలైన అంతర్యుద్ధం తర్వాత ఈ సరిహద్దులను మూసిఉంచారు. దేశ ప్రజలు సహాయాన్ని పొందేందుకు వీలుగా మూడు నెలల పాటు ఈ సరిహద్దులను తెరిచి ఉంచుతారు.

2 వేల ఏళ్ల నాటి కోట నేలమట్టం
ఇదిలా ఉండగా భూకంపం ధాటికి 2000 ఏళ్ల నాటి పురాతన కోట ధ్వంసమైంది. అప్పట్లో రోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న టర్కీలోని గజియాన్‌టెప్ కోట ఇప్పటికే శిథిలావస్థలోఉండగా, తాజా భూకంపం ధాటికి అది పూర్తిగా ధ్వంసమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News