Monday, December 23, 2024

టర్కీ పేరు ఇక తుర్కియో

- Advertisement -
- Advertisement -

Turkey changed its country name back to its former name Turkio

అంకారా : మధ్యప్రాచ్య కూడలి దేశం టర్కీ తమ దేశ పేరును తిరిగి పూర్వపు పేరు తుర్కియోకు మార్చుకుంది. ఈ మేరకు టర్కీ పేరు మార్పు ప్రతిపాదనకు ఐరాస అంగీకారం తెలిపింది. ఇకపై తమ దేశం పేరును టర్కీగా కాకుండా తుర్కియోగా పిలవాలని, ఈ విధంగానే వ్యవహరించాలని టర్కీ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో కోరింది. టర్కీ అధ్యక్షులు రెచప్ టయ్యప్ ఎర్డోవాస్ తమదేశ పేరును రీబ్రాండ్ చేయాల్సిన అవసరం అందుకు గల చారిత్రక కారణాలను గత ఏడాదే ఐరాసకు నివేదించారు. అయితే ఇప్పుడు పేరు మారింది. తమ దేశ తుర్కుల సంస్కృతి, సంప్రదాయాలు , నాగరికత విలువలకు చక్కని పదంగా తుర్కియో సరిపోతుందని, దీనినే గుర్తించాలని కోరుతూ ప్రతిపాదన పంపించారు. టర్కీ పేరు మార్పిడికి పలు కారణాలు ఉన్నాయని వెల్లడైంది. టర్కీ ఓ పక్షిపేరు,. పైగా టర్కీ పదానికి అపజయం, మూర్ఖత్వం, సిగ్గుమాలిన వ్యక్తి అనే అర్థాలు ఉన్నాయి. దీనితో పేరు మార్చాలనే క్రమం ఇప్పుడు బలోపేతం అయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News