Tuesday, September 17, 2024

పార్లమెంట్‌లో రక్తం వచ్చేలా కొట్టుకున్న ఎంపిలు.. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

తుర్కియే పార్లమెంట్‌లో ఎంపిల డిష్యుం డిష్యుం
అధికార, ప్రతిపక్ష ఎంపిల పరస్పర దాడులు
ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడిన వైనం
వర్కర్స్ పార్టీ నేత క్యాన్ అటలే విషయమై 16న జరిగిన చర్చే ఘర్షణకు కారణం

అంకారా : ఎంపిలు బాహాబాహీకి దిగడంతో తుర్కియే పార్లమెంట్ శుక్రవారం రణరంగాన్ని తలపించింది. అధికార, ప్రతిపక్ష ఎంపిలు ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. దీనితో అధికార పార్టీకి చెందిన ఒక మహిళా ఎంపితో పాటు ప్రతిపక్ష నేత ఒకరు కూడా గాయపడ్డారు. 2013లో తుర్కియే ప్రధానిగా ఉన్న ఎర్దోగన్ పాలనను వర్కర్స్ పార్టీ ఆఫ్ తుర్కియే అధినేత క్యాన్ అటలే అనేక సార్లు సవాల్ చేశారు. దీనితో 2013లో ఎర్దోగన్ పాలనకు వ్యతిరేకంగా పలు మార్లు నిరసన ప్రదర్శనలు జరిగాయి. దానితో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు కారణం క్యానే అటలే అని పేర్కొంటూ తుర్కియే కోర్టు 2022లో ఆయనకు 18 ఏళ్లు జైలు శిక్ష విధించింది.

ప్రస్తుతం ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారు, ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో క్యాన్ అటలే పార్లమెంట్ డిప్యూటీగా ఎన్నికయ్యారు. దానితో పార్లమెంట్‌కు హాజరయ్యేందుకు తనకు అవకాశం ఇవ్వాలని, తన పదవీ కాలం ముగిసిన వెంటనే మళ్లీ జైలు శిక్ష అనుభవిస్తానని అంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. దీనితో కోర్టు అటలేకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇదే అంశంపై శుక్రవారం పార్లమెంట్‌లో చర్చ జరిగింది. మాటా మాట పెరగడంతో అధికార, ప్రతిపక్ష ఎంపిలు పరస్పరం దాడి చేసుకున్నారు.

ఈ దాడిలో ఇద్దరు ఎంపిలకు గాయాలయ్యాయి. కాగా, ఎంపిలు రక్తం వచ్చేలా కొట్టుకున్నట్లు సమాచారం. ఈ ఘర్షణపై ప్రతికూల పార్టీ నేత ఓజ్‌గుర్ ఓజెల్ మాట్లాడుతూ, ఎంపిలు కొట్టుకోవడం సిగ్గుచేటు అని అన్నారు. పార్లమెంట్‌లో ప్రజా ప్రతినిధులు ఇలా దాడులు చేసుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తూ, నేలపై రక్తం పారుతోందని వాపోయారు. కనీసం మహిళా ఎంపిలను కనికరం లేకుండా కొడుతున్నారని విమర్శించారు. ఇక తుర్కియే చట్ట సభలో సభ్యులు ఇలా భౌతిక దాడి చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా పలు సందర్భాల్లో ఎంపిలు బాహాబాహీకి దిగి కొట్టుకున్న ఘటనలు చాలా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News