Saturday, November 9, 2024

278 గంటల తర్వాత సజీవంగా బయటపడ్డ వ్యక్తి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టర్కీ, సిరియాలో భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 41000కు పైగా పెరిగింది. కాగా భూకంపం నుంచి బతికి బట్టకట్టిన వారిని ఇప్పుడు అక్కడ తీవ్ర చలి బాధిస్తోంది. ఇప్పటికీ శిథిలాల కింద అనేక మంది చిక్కుకుని ఉండడాన్ని రెస్యూ సిబ్బంది కనుగొన్నారు. రిక్టరు స్కేలుపై 7.8గా నమోదయిన భూకంపం సంభవించి ఇప్పటికే 278 గంటలు గడిచిపోయాయి.

ఇప్పటికీ శిథిలాల తొలగింపులు జరుతున్నాయి. గురువారం కూడా రెస్యూ సిబ్బంది ముగ్గుర్ని ర‌క్షించారు. దాంట్లో 14 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. తాజాగా శనివారం అంటే దాదాపు 12 రోజుల త‌ర్వాత కూడా ఓ వ్య‌క్తి శిథిలాల కింద స‌జీవంగా ఉండడాన్ని రెస్యూ సిబ్బంది గుర్తించి రక్షించారు. ఆ వ్య‌క్తి పేరు హ‌క‌న్ యాసింగ్లో(45).

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News