టర్కీ భూకంపం వేలాది మంది కుటుంబాల్లో విషాదం నెలకొల్పింది. దాదాపు 24 వేల మందికిపైగా ప్రాణాలు బలితీసుకుంది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. దక్షిణ గాజియాంటెప్ ప్రావిన్స్‌లోని భవనం శిథిలాల నుండి ఒక యువకుడిని రెస్క్యూ సిబ్బంది సజీవంగా బయటకు తీశారు. అయితే శిథిలాల నుంచి బయటపడ్డ ఓ యువకుడు పెట్టిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
తన మూత్రాన్ని తానే తాగానని.. నిద్రపోకుండా ప్రతి 25 నిమిషాలకు ఓసారి అలారం సెట్ చేసుకున్నానని అద్నాన్ అనే యువకుడు పేర్కొన్నాడు. ఇలా 94 గంటల పాటు శిథిలాల కింద ఉన్నట్లు వివరించాడు. అద్నాన్ ముహమ్మత్ కోర్కుట్ గజియాంటెప్‌లోని సెహిత్‌కామిల్ జిల్లాలోని అపార్ట్‌మెంట్ శిధిలాల నుండి గురువారం ఆలస్యంగా రక్షించబడ్డాడని స్థానిక మీడియా వెల్లడించింది. సోమవారం తెల్లవారుజామున ఆగ్నేయ టర్కీ, పొరుగున ఉన్న సిరియాలో బలమైన భూకంపం సంభవించిన ముచ్చట తెలిసిందే. టర్కీలో భూకంప బాధితులకు భారత సైన్యం సహాయక చర్యలు అందచేస్తోంది.
🙏🙏 Gaziantep'te Gölgeler Apartmanında 17 yaşındaki Adnan Muhammet Korkut, 94. saatte enkazdan sağ olarak kurtarıldı.
📽️ Kurtarılma anları ve sevdiklerinin mutluluğu pic.twitter.com/ERM6TMTEi8
— Ajansspor (@ajansspor) February 10, 2023