Thursday, January 23, 2025

24 ఏళ్ల గరిష్టానికి టర్కీ వార్షిక ద్రవ్యోల్బణం…83.45 శాతం

- Advertisement -
- Advertisement -

Turkey

అంకారా:  టర్కీ వార్షిక ద్రవ్యోల్బణం సెప్టెంబరులో 24 సంవత్సరాల గరిష్ట స్థాయి 83.45 శాతానికి చేరుకుంది.   అధికారిక సమాచారం ప్రకారం సోమవారం నిత్యావసర వస్తువుల ధరను అధికం చేసింది,  ఇప్పటికే అధిక విద్యుత్తు, ఆహారం,  గృహ ఖర్చులను ఎదుర్కొంటున్న వారిని మరింత దెబ్బతీసింది. గత నెలతో పోలిస్తే వినియోగదారుల ధరలు 3.08 శాతం పెరిగాయని టర్కిష్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. అధికారిక గణాంకాల కంటే ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు.  స్వతంత్ర ద్రవ్యోల్బణ పరిశోధనా బృందం సోమవారం వార్షిక రేటును 186.27 శాతంగా పేర్కొంది. గత నెలలో టర్కీ సెంట్రల్ బ్యాంక్ మరొక వడ్డీ రేటు తగ్గింపును అందించింది.  పెరుగుతున్న ధరలు, పడిపోతున్న లిరా(టర్కీ కరెన్సీ) , అసమతుల్యమైన కరెంట్ ఖాతా ఉన్నప్పటికీ బెంచ్‌మార్క్ రేటును 12 శాతానికి తగ్గించింది.

సెంట్రల్ బ్యాంక్ గత ఏడాది రేట్లను తగ్గించడం ప్రారంభించినప్పటి నుండి లిరా అమెరికా డాలర్‌తో పోలిస్తే దాని విలువలో 50 శాతానికి పైగా కోల్పోయింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి,  లిరా క్షీణత ద్రవ్యోల్బణాన్ని ప్రేరేపించాయి. ఆర్థికవేత్తలు టర్కీలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఓవర్ కాన్ఫిడెన్స్  కారణంగా అధిక రుణ ఖర్చులు స్థిర ఆర్థిక సిద్ధాంతానికి విరుద్ధంగా అధిక ధరలకు దారితీస్తాయని చెప్పారు. వచ్చే సంవత్సరంలో ద్రవ్యోల్బణం తగ్గుతుందని తాను భావిస్తున్నట్లు ఎర్డోగాన్ చెప్పారు. స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ డేటా ప్రకారం, టర్కీలో రవాణా రంగంలో 117.66 శాతం, ఆహారం,  ఆల్కహాల్ లేని పానీయాల ధరలు 93 శాతానికి పెరిగాయి.

Turkey Currency

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News