- Advertisement -
ఇస్తాంబుల్ : సౌదీ అరేబియాతో సంబంధాలను చక్కదిద్దుకోడానికి టర్కీ ఓ ముందడుగు వేసింది. జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ హత్య కేసులో సౌదీ నిందితులపై విచారణను నిలిపి వేయాలని టర్కీ కోర్టు గురువారం ఆదేశించింది. ఈ కేసుపై విచారణను సౌదీ అరేబియాకు అప్పగించింది. 26 మంది సౌదీ నిందితుల పరోక్షంలో విచారణ జరపవద్దని , దీన్ని సౌదీ అరేబియాకు బదిలీ చేయాలని గత వారం ప్రాసిక్యూటర్ కోరారు. టర్కీ న్యాయశాఖ మంత్రి ఇటీవల మాట్లాడుతూ ప్రాసిక్యూటర్ విజ్ఞప్తిని ప్రభుత్వం ఆమోదిస్తుందని తెలిపారు. అయితే మానవ హక్కుల సంఘాలు టర్కీ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. తీవ్రంగా ఖండించాయి. అమెరికా జర్నలిస్టు ఖషోగ్గీ 2018 అక్టోబర్ 2 న హత్యకు గురయ్యారు. ఆయన సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని విమర్శించేవారు. టర్కీ లోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ కాన్సులేట్ లోకి ఆయన వెళ్లినప్పుడు ఈ హత్య జరిగింది.
- Advertisement -