Monday, December 23, 2024

ఐఎస్ గ్రూప్ చీఫ్ అబు హుస్సేన్‌ను మట్టుబెట్టిన టర్కీ దళాలు

- Advertisement -
- Advertisement -

అంకారా (టర్కీ) : సిరియా లోని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ చీఫ్ అబు హుస్సేన్ అల్ ఖురేషీని టర్కీ సైనిక దళాలు తమ ఆపరేషన్‌లో మట్టుబెట్టాయి. ఆదివారం పొద్దుపోయిన తరువాత టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఎంతోకాలంగా తమ నిఘా సంస్థ ఎంఐటి అతని కోసం గాలిస్తోందని, శనివారం తమ సైనిక దళాలు అతడిని మట్టుబెట్టాయని చెప్పారు. ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా తమ పోరాటం సాగుతుందని ఆయన చెప్పారు..టర్కీసిరియా సరిహద్దులో కుర్దిష్ వర్గాలను తరిమికొట్టడానికి టర్కీ ప్రభుత్వం ఉత్తరసిరియా లో ఉగ్రవాద స్థావరాలపై దాడులు ముమ్మరం చేసింది. అబు హుస్సేన్ అల్ ఖురేషీ 2022 నవంబర్‌లో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ బాధ్యతలు చేపట్టాడు.

అంతవరకు అబు ఇబ్రహిం అల్ హష్మీ అల్ ఖురేషీ చీఫ్‌గా ఉండేవాడు. దక్షిణ సిరియాలో జరిగిన ఆపరేషన్‌లో డారా ప్రావిన్స్‌లో అమెరికా సైన్యాలు ఆయనను మట్టుబెట్టాయి. దశాబ్దం క్రితమే అల్ కైదా నుంచి ఇస్లామిక్ స్టేట్ విడిపోయింది. సిరియా ఉత్తర,తూర్పు ప్రాంతాల్లో పట్టును కోల్పోయింది. అలాగే ఉత్తర, పశ్చిమ ఇరాక్‌లో కూడా నియంత్రణ కోల్పోయింది. ఇస్లామిక్ స్టేట్ సంస్థాపకుడు అబు బకర్ అల్ బఘ్దాడిని అమెరికా దళాలు వెంటాడి 2019 అక్టోబర్‌లో సిరియాలో చంపేశాయి. 2014లో ఈ ఉగ్రవాద సంస్థ కాలీఫతే ప్రపంచం మొత్తం మీద తమ మద్దతుదారులను ఆకర్షిస్తోందని ప్రకటించింది.గత కొన్నేళ్లుగా ఈ ఉగ్రసంస్థ ప్రపంచం మొత్తం మీద అనేక దాడులు చేస్తోంది. అనేక మందిని బలిగొంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News