Monday, November 25, 2024

పసుపు ధర ఆల్‌టైం రికార్డ్

- Advertisement -
- Advertisement -

Turmeric Quintal Price crosses nine thousand

కింటాలు రూ.9వేలు దాటేసింది

 

హైదరాబాద్: నిన్న మొన్నటిదాక బిక్కముఖంతో దిగాలు పోయిన పసుపు రైతుల ముఖాలు వెలిగిపోతున్నాయి. మార్కెట్‌లో పసుపు ధరలు ఆల్‌టైం రికార్డును నమోదు చేశాయి. రాష్ట్రంలో పసుపు విక్రయాలకు అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న నిజామాబాద్ మార్కెట్‌లో క్వింటాలు పసుపు ధర రూ.9389కు చేరుకుంది. నాణ్యతను బట్టి పసుపు పంటకు మంచి ధర పెట్టేందుకు కొనుగోలు దారులు పోటీలు పడుతున్నారు. నిజామాబాద్ మార్కెట్‌లో గత పదిరోజుల వ్యవధిలోనే క్వింటాలు ధర ఏకంగా రూ.2వేలు పెరిగింది. రానున్న రోజుల్లో పసుపు ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉగాది నాటికి క్వింటాలు పసుపు ధర పదివేల మార్క్ దాటే అవకాశం ఉందంటున్నారు. ఒక వైపున బంగారం ధరలు రోజురోజుకు కిందకు దిగుతుండగా మరోవైపు పచ్చబంగారంగా భావించే పసుపు ధరలు పైపైకి పెరుగుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Turmeric Quintal Price crosses nine thousand

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News