Monday, December 23, 2024

హైదరాబాద్‌లో రెండు కార్‌ కేర్‌స్టూడియోలు ప్రారంభించిన టర్టెల్‌ వ్యాక్స్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: చికాగో కేంద్రంగా కార్‌ కేర్‌ సేవలనందిస్తున్న అవార్డులు గెలుచుకున్న కంపెనీ టర్టెల్‌ వ్యాక్స్‌, ఇంక్‌ నేడు తమ రెండు సరికొత్త కో బ్రాండెడ్‌ కార్‌ కేర్‌ స్టూడియోలను హైదరాబాద్‌లో జెనెక్స్‌, రివల్యూషన్‌ సహకారంతో ప్రారంభించింది. అలా్ట్ర మోడ్రన్‌ టర్టెల్‌ వ్యాక్స్‌ డిటైలింగ్‌ సాంకేతితలతో పాటుగా అత్యున్నత అర్హతలు, సుశిక్షితులైన సేవా సిబ్బందిని కలిగిన ఈ టర్టెల్‌ వ్యాక్స్‌ కార్‌ కేర్‌ స్టూడియోలు విస్తృత శ్రేణి కార్‌ డిటైలింగ్‌ సేవలు, ఉత్పత్తులను కారు ప్రియుల అభిరుచులకు తగినట్లుగా అందించనున్నాయి.

జెనెక్స్‌ సెంటర్‌, ప్లాట్‌నెంబర్‌ 879, ఐడీపీఎల్‌ స్టాఫ్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ, కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీ, కూకట్‌పల్లి వద్ద ఉండగా, రివల్యూషన్‌ కేంద్రం పొలీస్‌ స్టేషన్‌, మినిస్టర్‌ రోడ్‌, బేగంపేట, రామ్‌గోపాల్‌ పేట ఎదురుగా, జీప్‌ షో రూమ్‌ పక్కన, తెలంగాణా 500085 వద్ద ఉంది. ఈ కార్‌ కేర్‌ స్టూడియోలు టర్టెల్‌ వ్యాక్స్‌ యొక్క ప్రపంచ ప్రసిద్ధి డిటైలింగ్‌ ఉత్పత్తులైన హైబ్రిడ్‌ సొల్యూషన్స్‌, హైబ్రిడ్‌ సొల్యూషన్స్‌ ప్రో ను పేటెంటెడ్‌ గ్రాఫైన్‌ టెక్నాలజీ తో అందిస్తాయి.

ఈ స్టూడియోల ప్రారంభం గురించి టర్టెల్‌ వ్యాక్స్‌ కార్‌ కేర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సాజన్‌ మురళి పురావంగర మాట్లాడుతూ ‘‘ హైదరాబాద్‌తో పాటుగా చుట్టు పక్కల ప్రాంతాలు కార్‌ కేర్‌ పరిశ్రమకు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌లుగా నిలుస్తున్నాయి. దక్షిణ భారతదేశ వ్యాప్తంగా అత్యుత్తమ శ్రేణి, ప్రీమియం క్వాలిటీ కార్‌ డిటైలింగ్‌ సేవలను ఈ స్టూడియోల ద్వారా అందించాలనుకుంటున్నాము. వినూత్నమైన డీఐఎఫ్‌ఎం సేవల లభ్యతను అనుభవించేందుకు అతి పెద్ద శ్రేణి విభాగాలు, ఉత్పత్తులను ఈ బ్రాండ్‌ కలిగి ఉంది. రివల్యూషన్‌ మరియు జెనెక్స్‌తో మా భాగస్వామ్యం ఈ ప్రాంతంలో అత్యుత్తమ సేవలు, ప్రయోజనాలు అందించగలవనే నమ్మకంతో ఉన్నాము’’ అని అన్నారు.

వినియోగదారులు ఇప్పుడు టర్టెల్‌ వ్యాక్స్‌ కార్‌ కేర్‌ స్టూడియోలో అత్యంత వేగవంతమైన సేవలను పొందవచ్చు. మరీ ముఖ్యంగా రోడ్డు మీదకు రాకుండానే ఈ సేవలను వినియోగించవచ్చు. టర్టెల్‌ వ్యాక్స్‌ ఉత్పత్తులు వాహన బాడీ పెయింట్‌కు ప్రమాదకరం కాని రీతిలో ఉండటంతో పాటుగా అసాధారణ వాతావరణ పరిస్థితులలో సైతం కారు వెలుపలి భాగాలను గీతలు, రంగు మారిపోవడం వంటి సమస్యల నుంచి కాపాడతాయి. టర్టెల్‌ వ్యాక్స్‌ ఇప్పుడు విస్తృత శ్రేణి ఇంటీరియర్‌ డిటైలింగ్‌ కార్‌ కేర్‌ ఉత్పత్తులు సైతం అందిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News