Monday, January 20, 2025

హైదరాబాద్‌లో నూతన కార్‌ కేర్‌స్టూడియోలు ప్రారంభించిన టర్టెల్‌ వ్యాక్స్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: చికాగో కేంద్రంగా కార్‌ కేర్‌ సేవలనందిస్తున్న, అవార్డులు గెలుచుకున్న కంపెనీ టర్టెల్‌ వ్యాక్స్‌, ఇంక్‌ నేడు తమ మూడు సరికొత్త కో బ్రాండెడ్‌ కార్‌ కేర్‌ స్టూడియోలను హైదరాబాద్‌లో జెనెక్స్‌, ఎక్స్ప్లోడర్, ఇండియన్ డెకార్స్ సహకారంతో ప్రారంభించింది. జెనెక్స్‌ సెంటర్‌, ప్లాట్‌నెంబర్‌ 4, అయ్యప్ప సొసైటీ మెయిన్ రోడ్ మాదాపూర్ వద్ద ఉండగా, ఎక్స్ప్లోడర్ కేంద్రం కె పి హెచ్ బి కాలనీ 5 వ ఫేస్, ఇండియన్ డెకార్స్ – ఇంటి నెంబర్ 8-2-270 , రోడ్ నెంబర్ ౩, బంజారా హిల్స్ వద్ద ఉంది. అల్ట్రా మోడ్రన్‌ టర్టెల్‌ వ్యాక్స్‌ డిటైలింగ్‌ సాంకేతితలతో పాటుగా అత్యున్నత అర్హతలు, సుశిక్షితులైన సేవా సిబ్బందిని కలిగిన ఈ టర్టెల్‌ వ్యాక్స్‌ కార్‌ కేర్‌ స్టూడియోలు విస్తృత శ్రేణి కార్‌ డిటైలింగ్‌ సేవలు, ఉత్పత్తులను కారు ప్రియుల అభిరుచులకు తగినట్లుగా అందించనున్నాయి.

టర్టెల్‌ వ్యాక్స్‌ గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీమతి లారీ కింగ్, టర్టెల్‌ వ్యాక్స్‌ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సాజన్ మురళీ పురవంగర ఈ స్టూడియోలను అతిధుల సమక్షంలో ప్రారంభించారు. ఈ మూడు కార్‌ కేర్‌ స్టూడియోలు కార్ కేర్ లో సంవత్సరాల తరబడి నైపుణ్యం మరియు డిటైలింగ్ ను హైదరాబాద్ కు తీసుకువచ్చాయి. టర్టెల్‌ వ్యాక్స్‌ యొక్క డిటైలింగ్ ఆవిష్కరణ మరియు నైపుణ్యంతో జత చేయబడటంతో పాటుగా, అత్యుత్తమ నాణ్యత మరియు కస్టమర్ సేవ ద్వారా ఉన్నతమైన విలువను అందించే లక్ష్యంతో, టర్టెల్‌ వ్యాక్స్‌ కార్ కేర్ స్టూడియోస్® ప్రొఫెషనల్ వాహన నిర్వహణ మరియు పరిశుభ్రత కోసం వినియోగదారుల డిమాండ్‌లను తీరుస్తుంది. ఈ స్టూడియో టర్టెల్‌ వ్యాక్స్‌ యొక్క సిరామిక్ మరియు గ్రాఫేన్ శ్రేణి నుండి అనేక రకాల కేర్ ప్యాకేజీలను అందిస్తోంది, అత్యాధునికమైన ఫలితాలను అందించడానికి తాజా సాంకేతికతలను ఉపయోగిస్తుంది.

కార్ కేర్ స్టూడియోలోని కస్టమర్‌లు పేటెంట్ గ్రాఫేన్ టెక్నాలజీతో హైబ్రిడ్ సొల్యూషన్స్ మరియు హైబ్రిడ్ సొల్యూషన్స్ ప్రో వంటి టర్టెల్‌ వ్యాక్స్‌ ® యొక్క ప్రపంచంలోని ఇష్టమైన డిటైలింగ్ ఉత్పత్తుల ద్వారా అందించబడిన ప్రొఫెషనల్ ఫలితాలను అనుభవిస్తారు. ఈ స్టూడియోల ప్రారంభం గురించి టర్టెల్‌ వ్యాక్స్‌ కార్‌ కేర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సాజన్‌ మురళి పురావంగర మాట్లాడుతూ ‘‘ మేము హైదరాబాద్‌లో మా మొదటి రెండు స్టూడియోలను ప్రారంభించిన తర్వాత హైదరాబాద్ నుండి కార్ కేర్‌పై పెరుగుతున్న ఆసక్తిని చూశాము. ఇక్కడ మా ఉనికిని విస్తరించడానికి మరో మూడు కార్ కేర్ స్టూడియోని తెరవాలని నిర్ణయించుకున్నాము.

ఈ సరికొత్త స్టూడియోతో, మేము రాష్ట్రవ్యాప్తంగా అత్యుత్తమ ప్రీమియం నాణ్యత గల కారు డిటైలింగ్ సర్వీస్‌ను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. అందుబాటులో ఉన్న ఏకైక DIFM సేవలను అనుభవించడానికి అతిపెద్ద శ్రేణి వర్గాలు, ఉత్పత్తులను కలిగి ఉన్నందుకు బ్రాండ్ గర్విస్తోంది. Xenex, Xploder & Indian Decars (జెనెక్స్, ఎక్స్ప్లోడర్, ఇండియన్ డెకా డెకార్స్)అనే మూడు స్టూడియోలతో మా భాగస్వామ్యం ఈ ప్రాంతంలో మంచి కార్ కేర్ సేవలు, ప్రయోజనాలను అందించగలదని మేము విశ్వసిస్తున్నాము. మేము మా డీలర్ నెట్‌వర్క్‌పై గర్వపడుతున్నాము. రాబోయే సంవత్సరాల్లో దానిని బలోపేతం చేయడం కొనసాగిస్తాము. దేశంలోని టైర్ 2 మరియు టైర్ 3 పట్టణాలలో కూడా కార్యక్రమాలు నిర్వహించనున్నాము ’’ అని అన్నారు.

వినియోగదారులు ఇప్పుడు టర్టెల్‌ వ్యాక్స్‌ కార్‌ కేర్‌ స్టూడియోలో అత్యంత వేగవంతమైన సేవలను పొందవచ్చు. మరీ ముఖ్యంగా రోడ్డు మీదకు రాకుండానే ఈ సేవలను వినియోగించవచ్చు. టర్టెల్‌ వ్యాక్స్‌ ఉత్పత్తులు వాహన బాడీ పెయింట్‌కు ప్రమాదకరం కాని రీతిలో ఉండటంతో పాటుగా అసాధారణ వాతావరణ పరిస్థితులలో సైతం కారు వెలుపలి భాగాలను గీతలు, రంగు మారిపోవడం వంటి సమస్యల నుంచి కాపాడతాయి. టర్టెల్‌ వ్యాక్స్‌ ఇప్పుడు విస్తృత శ్రేణి ఇంటీరియర్‌ డిటైలింగ్‌ కార్‌ కేర్‌ ఉత్పత్తులు సైతం అందిస్తుంది. వినియోగదారులు రోడ్లపైకి రాకముందే త్వరితగతిన శుభ్రంగా, తాజా అనుభూతిని పొందడం కోసం ఇప్పుడు టర్టెల్‌ వ్యాక్స్‌ కార్‌ కేర్‌ స్టూడియో®కి చెక్ ఇన్ చేయవచ్చు. టర్టెల్‌ వ్యాక్స్‌ ® ఉత్పత్తులు వాహనం యొక్క బాడీ పెయింట్‌కు ఎలాంటి హాని కలిగించవు, ప్రతికూలమైన వాతావరణ మార్పులను సైతం తట్టుకోగలవు, గీతలు, రంగు పోవటం, వాతావరణ పరిస్థితుల నుండి కారు ఎక్సటీరియర్ కు రక్షణను అందిస్తాయి. సంపూర్ణ మైన డ్రైవింగ్ అనుభవం కోసం ఇంటీరియర్ క్లీనింగ్ కూడా అంతే అవసరం, టర్టెల్‌ వ్యాక్స్‌ ® అనేక రకాల ఇంటీరియర్ డిటైలింగ్ కార్ కేర్ ఉత్పత్తులను కూడా అందిస్తుంది.

ఈ నూతన భాగస్వామ్యం గురించి ఎక్స్పర్ట్ ఆటో స్పా యజమాని శ్రీ హర్షద్ మహాజన్ మాట్లాడుతూ, “మేము ఎక్స్పర్ట్ ఆటో స్పా వద్ద నూతన ఆవిష్కరణలలో శ్రేష్ఠతను అందించడానికి మరియు కస్టమర్‌లకు ఆహ్లాదపరిచే అనుభవాలను అందించేందుకు కృషి చేస్తున్నాము. కార్ల సంరక్షణలో గ్లోబల్ లీడర్‌ తో భాగస్వామిగా ఉండటానికి మరియు వారికి ప్రాతినిధ్యం వహించడానికి మేము సంతోషిస్తున్నాము మరియు టర్టెల్‌ వ్యాక్స్‌ ® తో ఈ అనుబంధం మమ్మల్ని మరింత గా పైకి తీసుకెళ్తుందని, ఇక్కడ కార్ ప్రేమికులకు సంతోషం అందిస్తుందని విశ్వసిస్తున్నాము…” అని అన్నారు.

టర్టెల్‌ వ్యాక్స్‌ కార్‌ కేర్‌ స్టూడియో వద్ద లభ్యమయ్యే చికిత్సలు ఈ దిగువ రీతిలో ఉన్నాయి…

  • సెరామిక్‌ కోట్‌ ప్రొటెక్షన్‌ – ఇది పెయింట్‌ కరెక్షన్‌ను ప్రామాణిక డిటైలింగ్‌ ప్రక్రియ, ప్రీ క్లీన్‌, సెరామిక్‌ కోట్‌ ప్రొటెక్షన్‌తో  అందిస్తుంది.
  • హైబ్రిడ్‌ సెరామిక్‌ కోటింగ్‌ – దీనిలో బేసిక్‌ ఎక్స్‌టీరియర్‌ వాష్‌, రైన్స్‌, డ్రై , పెయింట్‌ కరెక్షన్‌, హైబ్రిడ్‌ సొల్యూషన్స్‌ వాష్‌, వెట్‌ వ్యాక్స్‌, హైబ్రిడ్‌ సొల్యూషన్స్‌ సెరామిక్‌ స్ర్పే కోటింగ్‌ కూడా భాగంగా ఉంటాయి.
  • ఎక్స్‌టీరియర్‌ రిస్టోరేషన్‌ ట్రీట్‌మెంట్‌ – ఇది మూడు రకాలుగా ఉంటుంది : పెయింట్‌ కరెక్షన్‌తో స్మార్ట్‌ షీల్డ్‌ టెక్నాలజీ ట్రీట్‌మెంట్‌ ; సూపర్‌ హార్డ్‌ షెల్‌ షైన్‌ ; క్లీన్‌ మరియు షైన్‌
  • ఇంటీరియర్‌ డిటైలింగ్‌ ట్రీట్‌మెంట్‌ – బేసిక్‌ ఇంటీరియర్‌ క్లీనింగ్‌ లేదా సమగ్రమైన ఇంటీరియర్‌ డిటైలింగ్‌ కోసం తోడ్పడుతుంది. దీనిలో కార్పెట్లు, అప్‌హోలెస్ట్రీ, రూఫ్‌ క్లీనింగ్‌ , ప్లాస్టిక్స్‌, వినైల్‌, సీట్స్‌ , లెదర్‌, ఏసీ వెంట్స్‌, ఎయిర్‌ ఫ్రెషనర్‌, డ్రెస్సింగ్‌, రబ్బర్‌ బీడింగ్‌, డోర్‌ జామ్స్‌, సీట్‌బెల్ట్స్‌, గ్లాస్‌ఉంటాయి
  • స్పెషాలిటీ ట్రీట్‌మెంట్‌ – దీనిలో ఓడర్‌ ట్రీట్‌మెంట్‌, హెడ్‌లైట్‌ లెన్స్‌ రిస్టోరేషన్‌, రెయిన్‌– రెపల్లంట్‌ కోటింగ్‌, ట్రిమ్స్‌, క్రోమ్స్‌రిస్టోరేషన్‌ ఉంటాయి.
  • వాష్‌– 45 నిమిషాల క్లీనింగ్‌ లో భాగంగా క్లీనింగ్‌, వాక్యూమింగ్‌, కాక్‌పిట్‌ క్లీనింగ్‌, ప్రీ వాష్‌ రైన్స్‌, అల్లాయ్‌ వీల్స్‌, టైర్స్‌ క్లీనింగ్‌, ఫోమ్‌ వాష్‌, స్ర్పెడ్‌, రైన్స్‌, డ్రై, గ్లాస్‌ క్లీనింగ్‌ , టైర్‌ డ్రెస్సింగ్‌ ఉన్నాయి.

టర్టెల్‌ వాక్స్‌ ఉత్పత్తులను టోల్‌ఫ్రీ నెంబర్‌ 1 800 102 6155 కు కాల్‌ చేసి, మా కస్టమర్‌ కేర్‌ బృందం customercareindia@turtlewax.com ను సంప్రదించటం ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఆధీకృత రిటైలర్‌ లేదా డిస్ట్రిబ్యూటర్‌ లేదా ఓఈఎం టై అప్స్‌ కోసం టర్టెల్‌ వాక్స్‌ కార్పోరేషన్‌ బృందంను indiatradeenquiry@turtlewax.com.. చేరుకోవచ్చు. భారతదేశంలో విడుదల చేసిన టర్టెల్‌ వాక్స్‌ ఉత్పత్తుల పూర్తి జాబితా గురించి తెలుసుకునేందుకు దయచేసి www.turtlewax.inచూడండి. సోషల్‌ మీడియాలో ఫేస్‌బుక్‌పై @ టర్టెల్‌ వ్యాక్స్‌ వద్ద, ఇన్‌స్టాగ్రామ్‌పైః @ టర్టెల్‌ వ్యాక్స్‌ India వద్ద చూడవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News