Wednesday, January 22, 2025

ఎన్వీ రమణను కలిసిన టియుడబ్ల్యుజె, ఐజెయు నేతలు

- Advertisement -
- Advertisement -

ఎన్వీ రమణను కలిసి….
కృతజ్ఞతలు తెలిపిన టీయుడబ్ల్యుజె, ఐజేయూ నేతలు
సంతోషం వ్యక్తం చేసిన మాజీ సీజే

తెలంగాణ: హైదరాబాద్ లో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లి ఏయిడెడ్ ఆపరెటీవ్ హౌజింగ్ సొసైటీ ఇళ్ల స్థలాల వ్యవహారంపై తీర్పు చెప్పి, ఎంతోకాలంగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు శుభవార్త చెప్పిన సుప్రీం కోర్టు తాజా మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ  తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టియుడబ్ల్యుజె). ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజెయు) నాయకులు కలిసి హైదరాబాద్ జర్నలిస్టుల పక్షనా కృతజ్ఞతలు తెలిపారు.  శనివారం నాడు ఎన్వీ రమణ ఢిల్లీ లోని క్రిష్ణ మీనన్ మార్గ్ లో గల ఆయన నివాసంలో టియుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ, ఐజెయు జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డిలు కలుసుకొని కృతజ్ఞతలు తెలపడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో ఆప్యాయంగా పలకరించి భోజనం చేసి వెళ్లాలని కోరారు. అంతేకాకుండా ఇవాళ ఎన్వీ రమణ జన్మదినం కావడంతో టియుడబ్ల్యుజె, ఐజెయు నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News