Thursday, January 23, 2025

డిసిఎం ఢీకొని టివి 5 ఉద్యోగి దుర్మరణం

- Advertisement -
- Advertisement -

మాదన్నపేట్‌ః ఆఫీసుకు బయల్దేరిన టివి 5 ఉద్యోగి సత్యానారాయణ ద్విచక్ర వాహనాన్ని డిసిఎం వెనుక నుంచి ఢీ కొట్టడంతో దుర్మరణం చెందాడు. ఈ ఘటన సోమవారం సంతోష్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంతోష్‌నగర్ ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ శేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అల్మాస్‌గూడకు చెందిన సత్యానారాయణ(39) టివి 5 ఆఫీసులో ప్రైవేట్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. విధుల కోసం రోజువారిగా సోమవారం మధ్యాహ్నాం తన పల్సర్ వాహనం పై ఇంటి నుంచి ఆఫీసు బయల్దేరిన్నాడు.

సంతోష్‌నగర్ క్రిస్టల్ బార్ వద్దకు రాగానే వెనక నుంచి అతివేగంతో డిసిఎం ఢీ కొట్టింది. దీంతో బాధితుడి తలకు తీవ్ర గాయం కావడంతో పోలీసులు వెంటనే ఉస్మానియా హాస్పటల్‌కు తరలించారు. కానీ అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. దీంతో బాధితుని భార్య కవిత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. డ్రైవర్ అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News