Sunday, December 22, 2024

సీరియల్ నటుడు చందు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

సీరియల్ నటుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…సీరియల్ నటుడు చంద్రకాంత్ అల్కాపురి కాలనీలో ఉంటున్నాడు. త్రినయినీ, రాధమ్మ కూతురు తదితర సీరియళ్లలో నటిస్తున్నాడు. చంద్రాకంత్ 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకోగా వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. త్రినయినీ సీరియల్‌లో నటించిన కర్నాటకకు చెందిన పవిత్ర జయరాంతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆరేళ్ల నుంచి ఇద్దరు కలిసి ఉంటున్నారు. మే,12వ తేదీన కర్నాటకకు వెళ్లిన పవిత్రా జయరాం తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా మహబూబ్‌నగర్ జిల్లా, భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి గ్రామం వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

దీంతో కుడివైపు నుంచి వనపర్తి నుంచి వస్తున్న ఆర్టిసి బస్సు పవిత్ర ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన పవిత్ర సంఘటన స్థలంలోనే మృతిచెందింది. అదే కారులో ప్రయాణించిన చంద్రకాంత్‌ను ఆస్పత్రికి తరలించారు. తర్వాత అతడికి పవిత్ర మృతిచెందిన విషయం తెలిసింది. అప్పటి నుంచి తీవ్రంగా మనస్థాపం చెందిన చంద్రకాంత్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News