Friday, December 20, 2024

‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో పాల్గొన్న నటి అర్చన..

- Advertisement -
- Advertisement -

TV Actress Archana plant saplings in Jubilee Hills

హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ఇండియా చాలెంజ్’లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్కులో తన తండ్రి కన్నడ నటుడు అనంత వేలుతో కలిసి కార్తీకదీపం సీరియల్ ఫేమ్ నటి అర్చన అనంత్(సౌందర్య) మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అర్చన అనంత్ మాట్లాడుతూ.. ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో బాగంగా తన తండ్రితో కలిసి మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు. ఇందులో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని ఇంత మంచి అవకాశం కల్పించినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

అనంతరం నటుడు అనంత వేలు మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. భూమాతకు ఆభరణం పచ్చదనం అని ప్రతి ఒక్కరు వీలైనన్ని మొక్కలు నాటి పచ్చదనంతో నింపాలని కోరారు. మంచి ఆక్సిజన్ లభించాలన్న ఆరోగ్యకరమైన జీవనం గడపాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని అర్చన, అనంత వేలు పిలుపునిచ్చారు.

TV Actress Archana plant saplings in Jubilee Hills

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News