Saturday, December 21, 2024

బుల్లితెర నటి శ్రీవాణికి రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

బుల్లితెర నటి శ్రీవాణికి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమె ప్రయాణిస్తోన్న కారు ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమె నుదుటి మీద తీవ్ర గాయం కావడంతో పాటు చెయ్యి ఫ్రాక్చర్ అయ్యినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గుంటూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆమె భర్త విక్రమాదిత్య వెల్లడించారు. 3రోజుల క్రితం కుటుంబంతో కలిసి చీరాల బీచ్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. శ్రీవాణి తెలుగులో పలు సీరియల్స్‌ నటించింది. అంతేకాదు పలు టీవీ షోల్లోనూ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News