Monday, December 23, 2024

నటి వీణాకపూర్ దారుణ హత్య.. బ్యాట్‌తో కొట్టి చంపిన కొడుకు

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రముఖ టీవీ నటి వీణా కపూర్‌ను కన్నకుమారుడే అత్యంత దారుణంగా చంపివేశాడు. స్థానికంగా ఈ ఘటన సంచలనం కలిగించింది. ఆస్తి తగాదా విషయంలో స్థానిక విలాసవంతమైన జుహూలోని విలే పార్లే ప్రాంతంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. కుమారుడు సచిన్ కపూర్(43) తల్లిని బేస్‌బాల్ బ్యాట్‌తో తలపై కొట్టడంతో ఆమె చనిపోయినట్లు, తరువాత ఆమె శవాన్ని తీసుకువెళ్లి ఓ నదిలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి సచిన్ కపూర్‌ను, ఇంటి పనివాడు ఛోటూ అలియాస్ లాలూకుమార్ మండల్(25)ను అరెస్టు చేశారు.

మంగళవారం రాత్రి వీణాకపూర్ నివాసం ఉంటున్న కల్పతరూ సొసైటీ సెక్యూరిటీ సూపర్‌వైజర్ ఒకరు పెద్దావిడ కన్పించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసు బృందాలకు విచారణ క్రమంలో కొడుకు చేసిన దారుణం గురించి వెల్లడైంది. హత్య సోమవారం రాత్రి కానీ మంగళవారం కానీ జరిగి ఉంటుందని, దీనికి సచిన్‌కపూర్‌కు ఇంటి పనివాడు సహకరించి ఉంటాడని స్పష్టం అవుతోంది. 74 సంవత్సరాల వీణాకపూర్ పలు సంవత్సరాలుగా టీవీలలో , కొన్ని సినిమాలలో నటించారు. పలువురు నటులతో ఆమె కలిసి పలు సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించారు. ఆమె విషాదాంతం పట్ల టీవీ పరిశ్రమ దిగ్భ్రాంతిని విచారాన్ని వ్యక్తం చేసింది. అరెస్టు అయిన ఇద్దరిని పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News