Friday, November 22, 2024

టివి, మొబైల్ ధరలు తగ్గొచ్చు

- Advertisement -
- Advertisement -

 కరోనా ముందు స్థాయికి రవాణ ఖర్చు తగ్గడమే కారణం
 అధిక రేట్లతో మందగించిన డిమాండ్
 సేల్స్ పెంపునకు కంపెనీల ప్రయత్నాలు
న్యూఢిల్లీ : గత రెండేళ్లుగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు రికార్డు స్థాయికి చేరుకొని, సామాన్యుడు కొనలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రజలకు అందుబాటు ధరలో టెలివిజన్, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఉత్పత్తులు పొందే అవకాశం వచ్చింది. దీపావళి సమయంలో ద్రవ్యోల్బణం నుండి ఉపశమనం పొందవచ్చని, ఎలక్ట్రిక్ వస్తువుల ధరలలో పెద్ద తగ్గుదల ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. పండుగ సీజన్‌లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు డిమాండ్‌ను పెంచడానికి కంపెనీలు భారీ తగ్గింపును ఇవ్వవచ్చని అం టున్నారు.

అధిక రేట్ల కారణంగా గత 12 నెలలుగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు డిమాండ్ మందగించింది. ఈ పరిస్థితిలో డిమాండ్ పెరుగుదలతో లాభాలు పెరుగుతాయని కంపెనీలు భావిస్తున్నాయి. కోవిడ్ మహమ్మారి కారణం గా టీవీ, మొబైల్, కంప్యూటర్ పరికరాల రవాణా ఖర్చు పె రిగింది. అయితే ఇప్పుడు కోవిడ్ ముందు స్థాయికి రవా ణా ఖర్చులు తగ్గుముఖం పట్టాయి. కోవిడ్ సమయంలో చైనా నుండి సరుకు రవాణా 8,000 డాలర్లు ఖర్చు అ యింది. అయితే ఇప్పుడు అది 850- 1,000 డాలర్లకి పడిపోయిందని మీడియా సంస్థ ఇటి నివేదిక తెలిపింది.

తగ్గిన సెమీకండక్టర్ ధర
సెమీకండక్టర్ చిప్‌ల ధరలు కోవిడ్ సమయంలో రికార్డు స్థాయిలో ఉండగా, ఇప్పుడు తగ్గాయి. ఎలక్ట్రానిక్ విడిభాగాల ధరలు 60 నుంచి -80 శాతం మేర తగ్గాయని పరిశ్రమ అధికారులు తెలిపారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రపంచ స్థాయిలో సరుకు రవాణా ఖర్చులో తగ్గుదల కనిపించింది. అయితే కొన్ని దేశాల్లో మాంద్యం కారణంగా స్వల్పంగా తగ్గింది. సరకు రవాణా ఖర్చు 4 నుంచి 5 శాతం ఎక్కువగా ఉంటుందని కొందరు పరిశ్రమ అధికారులు చెబుతున్నప్పటికీ, డిమాండ్ బలహీనంగా ఉండటంతో ఈ పెరుగుదల చోటు చేసుకుంది.
స్థిరంగా ముడిసరుకు ధరలు
హావెల్స్ ఇండియా చైర్మన్ అనిల్ రాయ్ గుప్తా మాట్లాడుతూ, ముడిసరుకు ధరలు కొంతకాలంగా స్థిరంగా ఉన్నాయని, దీని కారణంగా ఈసారి లాభాలు పొందవచ్చని అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News