Wednesday, December 25, 2024

రైలు, ఫ్లాట్‌ఫామ్ మధ్య ఇరుక్కొని టివి ఆర్టిస్టు మృతి

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం: రైలు, ఫ్లాట్‌ఫామ్ మధ్య ఇరుక్కొని ఓ టివి ఆర్టిస్టు మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చుంచుపల్లి మండలం నందాతండాకు చెందిన మేదర మహ్మద్దీన్ అనే వ్యక్తి టివి ఆర్టిస్టుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటివి జబర్దస్త్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా 50 ఎపిసోడ్స్‌లలో వివిధ పాత్రలు పోషించారు. మహ్మద్దీన్ భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. హైదరాబాద్‌కు వెళ్లేందుకు భద్రాచలం రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కేందుకు అతడు ప్రయత్నించాడు. రైలు ఎక్కే క్రమంలో అతడు జారీ రైలు, ఫ్లాట్‌ఫామ్ మధ్య ఇరుక్కున్నాడు. రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి చైన్ లాగి రైలును ఆపారు. వెంటనే అతడిని 108లో కొత్తగూడెంలోని సర్వజన ఆస్పత్రికి తరలించారు. నడుము, పక్కటెముకుల ప్రాంతంలో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తీవ్రంగా గాయపడిన అతడిని ఖమ్మంలో ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని కొత్తగూడెంలోని సర్వజన ఆస్పత్రికి తరలించారు. నందాతండాలో విషాదచాయలు అలుముకున్నాయి. మహ్మద్దీన్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News