Friday, December 20, 2024

పవిత్ర మృతి తట్టుకోలేకే నటుడు చంద్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

సీరియల్ నటుడు చందు ఆత్మహత్య తర్వాత కొత్త విషయాలు బయటికి వచ్చాయి. ఇప్పటి వరకు పవిత్ర జయరాం, చందు భార్యభర్తలుగా ఇప్పటి వరకు తెలిసినా, వారు ఆరేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నట్లు బయటికి వచ్చింది. చందుకు శిల్ప అనే యువతిని 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు, వీరికి కూతురు, కుమారుడు ఉన్నాడు. పాఠశాలలో చదువుకుంటున్న సమయంలోనే శిల్పను ప్రేమిస్తున్నట్లు చందు చెప్పాడు, మూడేళ్లు ఆమె వెంటపడ్డాడు. చందు ప్రేమను శిల్ప ఒప్పుకున్న తర్వాత 12 ఏళ్లు ప్రేమించుకుని తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ముందుగా ఏ పనిచేయకుండా తిరిగే చంద్రకాంత్ యాదవ్ తర్వాత సీరియళ్లలో నటించే అవకాశం రావడంతో ఒక్కసారిగా జీవితం మారిపోయింది. పవిత్ర జయరాం, చందు కలిసి త్రినయని సీరియల్లో అక్క, తమ్ముడి పాత్రల్లో నటించారు. అప్పడు వీరి మధ్య ఏర్పడిన పరిచయం సహజీవనానికి దారి తీసింది. పవిత్రతో పరిచయం ఏర్పడిన తర్వాత చందు భార్య, ఇద్దరు పిల్లలను వదిలేసి ఆమెతో ఉంటున్నాడు.

ఐదేళ్ల నుంచి భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో కూడా మాట్లాడనట్లు తెలిసింది. పవిత్రతో వివాహేతర సంబంధం పెట్టుకున్న చందు తనకు విడాకులు ఇవ్వాలని వేధించాడని అతడి భార్య శిల్ప చెప్పారు. తనతో ఐదేళ్ల నుంచి మాట్లాడడంలేదని, పిల్లలతో ఏమైనా కావాలన్నా చెప్పేవాడని తెలిపారు. త్రినయిని సీరియల్‌లో నటిస్తున్నప్పటి నుంచి వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగిందని చెప్పారు. ఐదు సంవత్సరాలుగా పవిత్ర మాయలో పడి తమను పట్టించుకోవడం మానేశాడని, ఇంటికి కూడా రాలేదని ఆమె వెల్లడించారు. పవిత్ర ఆకస్మిక మరణంతో డిప్రెషన్‌కు గురైన చందు మూడు రోజుల క్రితం కత్తితో చేయి కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడని కూడా తెలిపింది. పవిత్ర నీ దగ్గరకు వస్తున్నా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ కూడా పెట్టినట్లు చెప్పింది. ఈ విషయం చందు సోదరుడికి చెప్పానని తెలిపారు. పవిత్రతో ఉన్నప్పటి నుంచి తమను, భార్యాపిల్లలను చందు వదిలేశాడని చందు తండ్రి వెంకటేష్ చెప్పాడు. ఐదేళ్లుగా చందు తమ ఇంటికి కూడా రాలేదని తెలిపాడు. పవిత్ర మృతిచెందిన తర్వాత మూడు రోజుల క్రితం తమ ఇంటికి వచ్చిన చందు, పవిత్ర దగ్గరకు వెళ్లిపోతున్నా అని చెప్పాడని అన్నాడు. నిన్న ఉదయం లక్డీకాపూల్ వెళ్లొస్తానని చెప్పి తిరిగి రాలేదన్నాడు. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చి.. తెలిసిన వ్యక్తిని చందు ఫ్లాట్‌కు పంపించామని చెప్పాడు. అప్పుడే చందు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసిందన్నాడు.

పవిత్ర ఇంట్లోనే ఆత్మహత్య…
చందు గురువారం రాత్రి కూడా సూసైడ్ ప్రయత్నం చేశాడు. శుక్రవారం మధ్యాహ్న నుండి ఎవరి ఫోను చందు తీయలేదు. సాయంత్రం 6 గంటల సమయంలో పవిత్ర నివసిస్తున్న ఫ్లాట్ తలుపులు బద్దలు పట్టుకొని వెళ్లి చూడగా చందు సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది. వివాహం జరిగిన తర్వాత వివాహేతర సంబంధాల మూలంగా జీవితాలు నాశనం అవుతున్నాయని, తమ పరిస్థితి కూడా అలాగే ఉందని చందు భార్య శిల్ప ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్ర ఆకస్మిక మృతితో చందు ఒత్తిడికి గురయ్యాడని, ఇటీవల కత్తితో కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడని చెప్పారు. పవిత్ర నీ దగ్గరికి వస్తున్నా అంటూ ఇన్‌స్టాలో మెసేజ్ పెట్టినట్లు తెలిపారు. శుక్రవారం చందు ఫోన్ ఎత్తకపోయేసరికి అనుమానం కలిగి తమకు తెలిసిన వాళ్లను పవిత్ర ఇంటికి పంపినట్లు చెప్పారు. అప్పటికే ప్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

వారిద్దరు మంచి స్నేహితులు ః ప్రతీక్ష, పవిత్ర కూతురు
చందు, పవిత్ర జయరాం బంధం గురించి తప్పుగా మాట్లాడవద్దని పవిత్ర కూతురు ప్రతీక్ష కోరింది. వాళ్లిద్దరూ మంచి స్నేహితులు అని, చందు తనతో కూడా తరచూ ఫోన్‌లో మాట్లాడేవారని, చదువుకోవాలని ఎంతగానో ప్రోత్సహించే వారని తెలిపింది. మా అమ్మ(పవిత్ర) అంత్యక్రియలకు కూడా చందు వచ్చారని చెప్పింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News