చెన్నై: టెలివిజన్ నటి హీనా ఖాన్ కు బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ త్రీలో ఉంది. ఆమె సామాజిక మాధ్యమాల్లో తన వ్యాధి గురించి అభిమానులకు వివరిస్తూనే ఉంది. కానీ తనకు క్యాన్సర్ అన్న విషయం తెలుసుకున్న తల్లి భావాల గురించి, ఆమెతో భావోద్వేగంతో దిగిన ఫోటోను కూడా సామాజిక మాధ్యమంలో హీనా షేర్ చేసుకుంది.
హీనా షేర్ చేసిన ఫోటోలో ఆమె తల్లి ఆమెను హత్తుకుని ఓదారుస్తున్న ఫోటో అయ్యో అనిపించేలా ఉంది. దిగ్భ్రాంతికర వార్త విన్నా తన తల్లి తనకు అండగా నిలబడడాన్ని గురించి గొప్పగా చెప్పింది. ‘‘నా తల్లి కడలంత బాధను కూడా భరిస్తోంది. ఏ తల్లయినా తన పిల్లలకు ప్రేమను,ఓదార్పును పంచాలనే అనుకుంటుంది. నాకు బ్రెస్ట్ క్యాన్సర్ అన్నవార్త ఆమెకు నేడు తెలిసింది. వివిరించలేనంత బాధలో కూడా ఆమె నన్ను హత్తుకుని ఓదార్చింది. తల్లికి అన్ని అధిగమించే సూపర్ పవర్ ఉంటుంది. ప్రపంచం తల్లకిందులైనా ఆమె నాకు ఆశ్రయం ఇవ్వగలదు’’ అంటూ హీనా ఖాన్ తెలిపింది.