మార్కెట్లో అనేక సెగ్మెంట్లలో బైక్‌లు, స్కూటర్‌లను అందిస్తున్న టీవీఎస్ మోటార్స్ 125 సీసీలో టీవీఎస్ రైడర్ 125 కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. అయితే, టీవీఎస్ మోటార్స్ TVS రైడర్ 125 iGO లాంచ్ ద్వారా TVS రైడర్ 125 కొత్త వెర్షన్ ను మార్కెట్లో విడుదల చేసింది. దీంతో ఈ బైక్ సెగ్మెంట్లో అత్యంత వేగవంతమైన బైక్‌గా ఉంది. టీవీఎస్ 10 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని సాధించిన సందర్భంగా ఈ వేరియంట్‌ను విడుదల చేసింది కంపెనీ.
టీవీఎస్ కొత్త టెక్నాలజీ ద్వారా రైడర్ 125లో iGO సాంకేతికత అందించారు. కంపెనీ ప్రకారం..iGO అసిస్ట్ బూస్ట్ మోడ్‌తో మొదటి-ఇన్-సెగ్మెంట్ ఫీచర్‌తో కేవలం 5.8 సెకన్లలో 0 నుండి 60 kmph వరకు రైడర్‌ను వేగవంతం చేస్తుంది. అదనంగా, ఇంధన సామర్థ్యం 10 శాతం మెరుగుపరిచింది.
ఫీచర్లు
కంపెనీ ఈ బైక్ కు ఎన్నో గొప్ప ఫీచర్లను అందించింది. టీవీఎస్ స్మార్ట్ కనెక్ట్ టీఎం టెక్నాలజీ బైక్ కొత్త వేరియంట్‌లో ఇవ్వబడింది. ఇది వాయిస్ అసిస్ట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి 85 కంటే ఎక్కువ బ్లూటూత్ కనెక్ట్ చేయబడిన ఫీచర్‌లతో కొత్త రివర్స్ LCD క్లస్టర్‌ను పొందుతుంది. రైడ్ రిపోర్ట్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ వంటి ఫీచర్లు కూడా ఇందులో అందించారు. బైక్‌కు 5-దశల సర్దుబాటు చేయగల మోనో-షాక్ సస్పెన్షన్, తక్కువ ఫ్రిక్షన్ ఫ్రంట్ సస్పెన్షన్, స్ప్లిట్ సీట్ కూడా ఉన్నాయి.
ఇంజిన్
టీవీఎస్ నుండి రైడర్ 125 కొత్త వేరియంట్ 124.8 cc కెపాసిటీ గల ఎయిర్, ఆయిల్ కూల్డ్ 3V ఇంజన్‌తో వస్తుంది. దీని కారణంగా బైక్ 8.37 కిలోవాట్ల శక్తిని పొందుతుంది. అయితే,ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉంది. దానితో పాటు..17-అంగుళాల టైర్లు అందుబాటులో ఉన్నాయి.
ధర
టీవీఎస్ రైడర్ 125 కొత్త వేరియంట్‌ను కంపెనీ రూ. 98389 ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసింది. మార్కెట్లో దీని ప్రత్యక్ష పోటీ ఇటీవల విడుదలైన బజాజ్ పల్సర్ N125, Hero Xtreme 125, Honda Shine 125, SP125 వంటి బైక్ లు ఉన్నాయి.