కోక్రఝర్(అసోం): ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ట్విట్టర్‌లో వివాదాస్పద ట్వీట్లు చేసి అరెస్టయిన కాంగ్రెస్ నేత, గుజరాత్ ఎమ్‌ఎల్‌ఎ జిగ్నేష్ మేవానీకి బెయిల్ లభించింది. అసోంలోని కోక్రఝర్ కోర్టు ఈమేరకు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఆర్డర్‌ను ఆదివారం రిజర్వు చేసిన కోర్టు సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. బెయిల్ వచ్చిన సందర్బంగా రిపోర్టర్లతో జిగ్నేష్ మాట్లాడారు. తన అరెస్టును ప్రధాని కార్యాలయం చేస్తున్న కక్షపూరిత రాజకీయంగా పేర్కొన్నారు. ఇది బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల కుట్రగా విమర్శించారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠకు కళంకం తీసుకురావాలనే ఉద్దేశ్యం తోనే అరెస్టు చేశారు. ఇదంతా పద్ధతి ప్రకారం జరిగిందని మండి పడ్డారు. రోహిత్ వేముల నుంచి చంద్రశేఖర్ అజాద్ వరకు జరిగిందిదే. ఇప్పుడు తనను లక్షంగా చేసుకున్నారని జిగ్నేష్ మేవానీ మండిపడ్డారు.
Tweet against PM Modi: Jignesh Mevani gets bail