Friday, December 27, 2024

ట్విట్టర్ వార్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రజలను మోసం చేసి గెలిచింది అబద్ధపు హామీలతో
ప్రజలను మాయ చేసింది డిసెంబర్ 9లోపు నెరవేరుస్తామన్న
కాంగ్రెస్ గ్యారంటీల పరిస్థితి ఏమిటి? హామీలు ఇచ్చే ముందు
కనీసం అధ్యయనం చేయలేదు కర్నాటక సిఎం ట్వీట్‌కు ఎక్స్
వేదికగా కెటిఆర్ కౌంటర్ ట్వీట్ ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు
సంధించిన బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుం డా ప్రజలను మోసగించేలా అబద్ధపు హామీలు ఇవ్వడం వల్లే శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిందని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ట్వీట్‌కు కెటిఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కెటిఆర్ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. డిసెంబరు 9వ తేదీ లోపు నెరవేరుస్తామన్న కాంగ్రెస్ గ్యారంటీల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ హామీలు నకిలీవని, హామీలు ఇచ్చిన వారూ నకిలీ నేతలని విమర్శించారు. రైతులకు, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తామన్న రైతు భరోసా ఎక్కడ పోయింది..? అని నిలదీశారు. రెండు లక్షల రూపాయల వ్యవసాయ రుణమాఫీ ఏమైంది..? రూ. 4 వేల ఆసరా పెన్షన్ ఏమైంది..? రూ. 500కే గ్యాస్ సిలిండర్ అన్న మాట ఎక్కడ పోయింది..? ప్రతి మహిళకు రూ. 2,500 ఇస్తామన్నారు కదా ఆ మాట ఏమైంది..? మొదటి కేబినెట్‌లోనే మెగా డిఎస్‌సిపైన ప్రకటన ఉంటుందని చెప్పిన హామీపై చర్యలు ఏవి..? మొదటి కేబినెట్‌లోనే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత తీసుకువస్తామని చెప్పిన మాట ఏది..? ఇలా మీరు ఇచ్చిన హామీలు నకిలీవా..? లేదా ఈ మాటలు చెప్పిన మీ కాంగ్రెస్ నేతలు నకిలీలా చెప్పాలి అని కెటిఆర్ ట్విట్టర్ వేదికగా నిలదీశారు.

మరి మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉండి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన మీ పార్టీ పరిస్థితి వివరించగలరా అని కర్ణాటక సిఎం సిద్ధరామయ్యను కెటిఆర్ ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు డబ్బులు లేవంటున్న కర్ణాటక సిఎం, ఇదే మాట తెలంగాణ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ చెబుతుందా అంటూ కెటిఆర్ సందేహం వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి గురించి సాకులు చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇవ్వడానికి ముందు కనీసం అధ్యయనం చేయలేదని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News