Saturday, December 21, 2024

మరో 12 చీతాలు రాక

- Advertisement -
- Advertisement -

దక్షిణాఫ్రికా నుంచి కూనో నేషనల్ పార్కుకు తరలింపు
పార్కులోని ఎన్‌క్లోజర్లలోకి విడుదల చేసిన మధ్యప్రదేశ్ సిఎం, కేంద్రమంత్రి

షేవోపూర్(మధ్యప్రదేశ్): దేశంలో అంతరించి పోయిన చీ తాల పునరుద్ధరణ కార్యక్రమంకింద దక్షిణాఫ్రికానుంచి మరో 12 చీతాలు శనివారం మధ్యప్రదేశ్‌కు చేరుకున్నా యి. గత ఏడాది సెప్టెంబర్‌లో 8 చీతాలు నమీబియానుంచి మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్కుకు చేరుకున్న విష యం తెలిసిందే. ఇప్పుడు మరో ఆఫ్రికా దేశమైన దక్షిణాఫ్రికానుంచి మరో 12 చీతాలు భారత్‌కు చేరుకున్నారు.

12 చీతాలతో దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్‌బర్గ్ నుంచి శుక్రవా రం సాయంత్రం బయలుదేరిన వాయుసేనకు చెందిన వి మానం శనివారం ఉదయం గ్వాలియర్‌లోని ఎయిర్‌బేస్‌కు చేరుకుంది.అక్కడినుంచి ఈ చీతాలను హెలికాప్టర్‌లలో కూ నో నేషనల్ పార్కుకు తరలించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమం త్రి శివరాజ్ సింగ్, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌యాదవ్‌లు ఈ చీతాలను పార్కులోని క్వారంటైన్ ఎన్‌క్లోజర్లలోకి విడుదల చేశారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం వాటిని 30 రోజలు పాటు క్వారంటైన్‌లో ఉంచిన అనంతరం పెద్ద ఎన్‌క్లోజర్లలోకి పంపిస్తామని చీతా ప్రాజెక్టు చీఫ్ ఎస్‌పి యాదవ్ తెలిపారు.

ఈ రోజు దక్షిణాఫ్రికానుంచి భారత్‌కు చేరుకున్న 12 చీతాల్లో ఏడు మగ చీతాలు కాగా, అయిదు ఆడ చీతాలున్నాయి. వీటితో కలిపి కూనో పార్కులో చీతాల సంఖ్య 20కి చేరుకుంది. వీటిలో 10 మగ, మరో 10 ఆడచీతాలున్నాయి. దేశంలో 71 ఏళ్ల క్రితం అంతరించి పోయిన చీతాలను ప్రభుత్వం మళ్లీ పునరుద్ధరిస్తోంది. ఇందులో భాగంగా ఆఫ్రికా దేశాలనుంచి విడతలవారీగా దిగుమతి చేసుకుంది. ప్రపంచంలో చీతాలు ప్రధానంగా ఆఫ్రికా దేశాల్లో ఉండగా, వీటిలో అత్యధికం నమీబియాలో ఉన్నాయి. కాగా ప్రస్తుతం భారత్‌కు చేరుకు న్న చీతాలను దక్షిణాఫ్రికా విరాళంగా ఇచ్చింది. అయితే వీటిని పట్టుకోవడానికి మన దేశం ఒక్కో చీతాకు 3 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని ఓ వన్యప్రాణి నిపుణుడు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News