Saturday, April 5, 2025

ఇరాన్‌లో ఒక్క రోజే 12 మందికి ఉరి

- Advertisement -
- Advertisement -

Twelve people were hanged in single day in Iran

ఏడాదిలో 333 మందికి మరణశిక్ష

పారిస్ : ఇరాన్‌లో మరణశిక్షలు ఏటేటా పెరుగుతున్నాయి. తాజాగా సోమవారం ఒక్క రోజే 12 మంది ఖైదీలను ఉరి తీసినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2021 లో ఒక్క ఏడాది లోనే 333 మందికి మరణశిక్ష అమలు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 25 శాతం అధికం. ఈ విధంగా ఇరాన్‌లో ప్రతిఏటా పెరిగిపోతున్న మరణశిక్షలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అఫ్గానిస్థాన్ పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న సిస్థాన్ బలూచిస్థాన్ ప్రావిన్సు లోని జహేడన్ కారాగారం లోని 12 మంది ఖైదీలకు సోమవారం ఒక్క రోజే ఉరిశిక్ష అమలు చేశారు. వారిలో 11 మంది పురుషులు ఉండగా, ఒక మహిళ ఉన్నట్టు సమాచారం.

వీరిలో ఆరుగురిపై డ్రగ్స్ అభియోగాలు ఉన్నాయి. మరో ఆరుగురు హత్య కేసులో ఉన్నట్టు ఇరాన్ మానవ హక్కుల సంఘం తెలిపింది. వీరిలో ఉన్న మహిళ, తన భర్తను హత్య చేసిన అభియోగంపై 2019 లో అరెస్టయింది. మరణశిక్ష పొందిన వారంతా బలూచ్ మైనారిటీ వర్గానికి చెందిన వారేనని ఐహెచ్‌ఆర్ పేర్కొంది. ఇరాన్‌లో 2021 లో ఒక్క ఏడాదిలోనే 333 మందికి మరణశిక్ష అమలు కాగా, అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఉరిశిక్షల్లో 25 శాతం పెరుగుదల కనిపించింది. ఉరిశిక్ష పడిన వారిలో 21 శాతం మంది బలూచ్ ఖైదీలే కాగా, కేవలం 2 నుంచి 6 శాతం మంది మాత్రమే ఇరాన్‌కు చెందిన వారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News