Sunday, January 19, 2025

20 ఏండ్లకు కలిసిన కవలలు అమీ అనో

- Advertisement -
- Advertisement -

బిలిసి : రక్తబంధం, కవలల సహోదరత్వం బలీయం అని నిరూపితం అయింది. తనలాగానే తన తోబుట్టువుగా ఎవరో ఒక్కరు ఉన్నారని 20 ఏళ్లుగా తపిస్తోన్న కవల అమ్మాయిలు తిరిగి ఒక్కటయ్యారు. తూర్పు యూరప్ దేశమైన జార్జియాలో సినిమాలను తలపించే నిజజీవిత ఘట్టం చోటుచేసుకుంది. ఇన్నేళ్లుగా అంటే 2002లో విడిపోయి , తిరిగి టిక్‌టాక్ మాధ్యమం ప్రసారాల ద్వారా ఈ కవలలు ఒక్కటికావడం ప్రపంచ చరిత్రలో అనుబంధాల అధ్యాయంలో కీలక పుట అయింది. టిక్‌టాక్ వీడియో, దీనికి తోడుగా బిబిసిలో వచ్చిన టీవీ టాలెంట్ షో క్రమంలో ఇప్పుడు కవలలైన అక్కాచెల్లెళ్లు అనో, అమీ ఒక్కటయ్యారు. 200నలో జార్జియాలోని ఆసుపత్రిలో అజాశోని అనే మహిళకు పండంటి కవల ఆడబిడ్డలు జన్మించారు. అయితే ప్రసవానంతరం తల్లి కోమాలోకి వెళ్లింది. ఇదే అదునుగా చూసుకుని ఆమె భర్త అమానుషంగా ఇద్దరు కూతుళ్లును డబ్బుల కోసం వేర్వేరు కుటుంబాలకు విక్రయించాడు.

బిడ్డలు చనిపోయ్యారని తల్లికి నచ్చచెప్పాడు. వేర్వేరు కుటుంబాలకు కవల పిల్లలు చేరారు. వీరి పేగుబంధం దూరం అయింది. జార్జియా రాజధాని బిలిసిలో అనో పెరిగింది. ఇక్కడికి కొద్ది దూరంలోని జగ్‌డిడి పట్టణంలో అమి ఖ్విటియా ఉండాల్సి వచ్చింది. వీరికి పన్నెండేళ్ల వయస్సు వచ్చినప్పుడు వీరి కలయిక విషయంలో కీలక మలుపు ఏర్పడింది. జార్జియాస్ గాట్ షోలో అమీ పాల్గొంది. అక్కడ ఈ షోలో తన లాగానే అచ్చుపోసినట్లు ఉండే తన వయస్సులోనే ఉన్న మరో అమ్మాయి డాన్స్ చేస్తూ ఉండటంతో కంగుతింది. ఆమె ఆమెనా? లేక తానా అనే సందేహానికి గురైంది. తన వంటి జుట్టు, ముఖకవళికలు, మ్యానరిజం అంతా తన ప్రింట్ కావడంతో తనకు ఆమెకు ఏదో బంధం ఉందని అనుకుంది. అక్కడితో ఈ కథ ఆగింది. ఈ షో చూసిన వారంతా ఈ ఇద్దరు అమ్మాయిలు భలేగా ఉన్నారనుకుని విషయాన్ని గాలికి వదిలేశారు. అయితే ఆ తరువాత కొంత కాలానికి జరిగిన మరో షోలో ఇద్దరమ్మాయిలు కలిశారు. ఇటువంటి షోలో పాల్గొనడం అనేది వీరికి ఉన్న భావసారూప్యతల ఉమ్మడి సార్వత్రిక అభిరుచి కావడంతో వీరు తిరిగి అక్కడ కలిశారు.

తన వంటి నీలికురులు తననే పోలిన అమ్మాయి పరస్పర పరిచయాలు, తాము చిన్ననాటి నుంచి ఎదుర్కొంటున్న అంతర్గత స్పందనల గురించి జార్జియాలోని రస్టావెలి బ్రిడ్జిపై మాటలు కలిసిన క్రమంలో పంచుకున్నారు. ఈ క్రమంలో తామిద్దరం కవల సోదరీలమనే విషయాన్ని నిర్థారించుకున్నారు. ఇప్పుడు వీరు కలిసి జీవించే సమయం వచ్చింది. అక్కాచెల్లెలిగా తిరిగి తాము లోకానికి పరిచయం అవుతున్న వైనం మించిన ఆనందం ఇప్పుడు తమకు అమూల్యమైనదని ఈ నీలికురుల అమ్మాయిలు తెలిపారు. పేదరికం, చెడువ్యసనాలు కారణంగా కొన్ని కుటుంబాల్లో పుట్టిన పిల్లలను తెగనమ్మడం అనే తంతు సాగుతోందని, ఈ క్రమంలో పలు ఆసుపత్రుల నుంచి అప్పుడే పుట్టిన పసికందులు మాయం కావడం, కొన్ని సందర్భాలలొ తండ్రి లేదా తల్లి లేదా తల్లిదండ్రులు ఇద్దరూ కనీస కనికరం కడుపు తీపి మాటల ఆనవాళ్లు లేకుండా విక్రయించడం జరుగుతోందని ఆ మధ్యలో బిబిసి వెలువరించిన కథనం ప్రపంచవ్యాప్తంగా సంచలనానికి దారితీసింది. ఇప్పుడు ఒక్కటైన ఈ కవలల నిజజీవిత ఘట్టం ఈ వార్తా కథనంలో కీలక మలుపునకు దారితీసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News