Sunday, November 17, 2024

ట్యాపింగ్‌లో సంచలనాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తె లుగు రాష్ట్రాల్లో పెను సంచల నం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నా యి. టాస్క్‌ఫోర్స్ మాజీ డిసిపి రా ధాకిషన్‌రావు వాంగ్మూలం లో ఎంఎల్‌ఎల కొనుగోలు కేసు కు సంబంధించి విస్తుపోయే అంశాలు వెల్లడించినట్టు తెలిసింది. కోమటిరెడ్డి రా జగోపాల్‌రెడ్డి 2022 అక్టోబర్‌లో కాం గ్రెస్‌కు రాజీనామా చేసి బిజెపిలో చేరినపుడు మునుగోడు ఉప ఎన్నికల్లో ఆయనను ఓడించాలని కెసిఆర్ భావించార ని, రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో వెల్లడి చేసినట్లు సమాచారం. దుబ్బాక, హు జురా బాద్ ఉప ఎన్నికల్లో బిజెపి అ భ్యర్థులు గెలిచినందున మునుగోడులో ఎలాగైనా బిజెపిని ఓ డించాలనే లక్ష్యంతో కెసిఆర్ ఉన్నట్టు రాధాకిషన్‌రావు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో నే పైలెట్ రోహిత్‌రెడ్డి సహా పలువురు ఎంఎల్‌ఎ లు బిజెపిలో చేరేందుకు ఆ పార్టీ అగ్రనేతలను సంప్రదించిన ట్టు తెలిసింది. ఇది తెలిసి బిజెపికి చెక్ పెట్టేందుకు వారిపై సర్వేలైన్స్ పెట్టాలని కెసిఆర్ ఎస్‌ఐబికి చె ప్పినట్టు రాధాకిషన్‌రావు తన వాం గ్మూలంలో పేర్కొన్నట్లు సమాచా రం.

అప్పటి ఎస్‌ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఎంఎల్‌ఎల కొనుగో లు అంశం పై తనతో చర్చించారని, బిజెపి అ గ్రనేతల ఫోన్‌లను ప్రణీత్‌రా వు బృందం ట్యాప్ చేసిన ట్టు రాధాకిషన్‌రావు చె ప్పారని, అలా ట్యా ప్ చే సిన ఒక ఆడియో కెసిఆర్ కు పంపినట్టు వెల్లడించార ని తెలిసింది. ఆ తర్వాతే కెసిఆర్ అందరినీ ట్రాప్ చేయాలని ఆదేశించినట్టు పేర్కొన్నట్లు సమాచా రం. ఈ క్రమంలో స్పై కెమెరాల కోసం టాస్క్‌ఫో ర్స్ టీంను ఢిల్లీ పంపామని, ట్రాప్ చేయడానికి ఒకరోజు ముందే కెమెరాలను ఫామ్‌హౌస్‌లో అ మర్చామని వెల్లడించినట్లు సమాచారం. ఆపరేష న్ మొత్తం బాధ్యతను సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులకు అప్పగించామని రాధాకిషన్ రావు తెలిపిన ట్లు తెలుస్తోంది. ఎంఎల్‌ఎల కొనుగోలు కేసు కో సం ప్రత్యేక దర్యాప్తు వేసి బిజెపి అ గ్రనేత బిఎల్ సంతోష్‌ను అరెస్టు చేయాలని కెసిఆర్ ఆదేశించినట్టు చెప్పారని తెలిసింది. బీఎల్ సంతోష్‌ను అరెస్టు చేస్తే ఢిల్లీ మద్యం కేసులో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత అరెస్ట్ కాకుండా బిజెపి అగ్రనేతలతో చర్చలు జరుపుదామని అనుకున్నట్టు రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో వెల్లడించారని తెలిసింది.

అయితే కొంతమంది అధికారుల అసమర్థతవల్లే సంతోష్‌ను అరెస్ట్ చేయలేకపోయామని, పలువురు అధికారులను కేరళకు పంపించినా ప్రణాళికను విజయవంతం చేయలేదని, సంతోష్‌ను అరెస్టు చేయకపోవడంపై కెసిఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు రాధాకిషన్‌రావు వివరించినట్లు తెలిసింది. కెసిఆర్‌తో ఉన్న అనుబంధం వల్ల ఇంతకంటే ఎక్కువ విషయాలను చెప్పలేనని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు సమాచారం. అదే విధంగా బిఆర్‌ఎస్‌కు ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లను నిఘా పెట్టినట్లు రాధాకిషన్ రావు ఒప్పుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇక మీడియా యజమానులకు కూడా వదల్లేదని, కీలక ఛానళ్ల యజమానుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలిపారు. బిఆర్‌ఎస్ పార్టీని ట్రోలింగ్ చేసినవారిని కూడా టార్గెట్ చేసినట్లు ప్రణీత్ రావు వెల్లడించారు. కుత్బుల్లాపూర్ ఎంఎల్‌ఎతో విభేదాలున్న శంబీపూర్ రాజుపై రాధాకిషన్ రావు నిఘా ఉంచినట్లు తెలిసింది. జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణల ఫోన్లు ట్యాప్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఇంటర్నెట్ ప్రొటోకాల్ డేటా రికార్డ్‌ను ప్రణీత్ రావు విశ్లేషించారు.

కాంగ్రెస్, బిజెపి నేతలకు ధన సహాయం చేసే వారిపై నిఘా ఉంచినట్లు రాధాకిషన్ రావు వెల్లడించారు. కడియం శ్రీహరి రాజయ్య మధ్య విభేదాలపై నిఘా ఉంచినట్లు వెల్లడించారు. రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న, ఈటల, అర్వింద్ ఫోన్లను ట్యాప్ చేసినట్లు వెల్లడించారు. ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని వాట్సాప్, స్నాప్ చాట్‌లో మాట్లాడిన వారి వివరాలను సేకరించినట్లు రాధాకిష న్ రావు వెల్లడించారు. ఎబిఎన్ -ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తేలింది. ఆర్కే ఫోన్‌ను కెసిఆర్ సర్కారే ట్యాప్ చేయించినట్లు రాధాకిషన్‌రావు వెల్లడించారు. దీంతో పాటు మరో ఛానల్ యజమాని ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందని ఆయన వెల్లడించారు. గద్వాల, కోరుట్ల, మానకొండూరుకు చెందిన విపక్ష నేతలు, దీంతో పాటు కన్‌స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన పలువు రు వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు రాధాకిషన్‌రావు వాంగ్మూలంలో చెప్పారని సమాచారం.

నాటి మంత్రి హరీష్‌రావు ఆదేశాలతో ప్రణీత్ రావుతో డైరెక్ట్‌గా టచ్‌లోకి ఓ మీడియా యజమాని వెళ్లినట్లు తేలింది. మీడియా యజమాని ఇచ్చిన సమాచారంతో పలువురి ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు ప్రణీత్‌రావు కుండ బద్ధలు కొట్టారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో విఐపిల సమాచారాన్ని ప్రణీత్‌రావుకు సదరు మీడియా యజమాని అందించినట్లు తాజాగా తేలిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News