Monday, December 23, 2024

ప్రభాకర్‌రావును రప్పించండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రం లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపిం గ్ కేసులో కీలక పరిణామం చోటు చేసు కుంది. ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (ఎ1), ఓ తెలుగు న్యూస్ చానల్ ఎండి శ్ర వణ్ రావు (ఎ6) ను కోర్టులో హాజరు ప ర్చాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చే సింది. ఇప్పటికే ప్రభాకర్ రావుపైన కోర్టు నాన్‌బెయిల బుల్ వారెంట్లు జారీ చేసిన వి షయం విదితమే. ప్రభాకర్‌రావు వర్చువల్ గా విచారణకు హాజరవుతారని కోర్టు దృ ష్టికి దర్యాప్తు బృందం తీసుకెళ్లింది. అయి తే ప్రభాకర్ రావు విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావు, శ్రవణ్‌రావులను పోలీసులు ఇండియాకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాలో ప్రభాకర్ రావు ఉన్నట్లు సిట్ బృందం గుర్తించింది. అయితే, శ్రవణరావు ఆచూకీని మాత్రం దర్యాప్తు బృందం ఇప్పటికీ కనుగొనలేకపోయినట్లు సమాచారం.

ఈ కేసులో ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్‌రావే ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చిన విషయం విదితమే. ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ఫోన్ టాపింగ్ జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఫోన్ టాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్లిపోయాడు. దీంతో ప్రభాక ర్ రావు ఆచూకీ కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. లుక్ అవుట్ నోటీసులకు స్పందన లేకపోవడంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఈ కేసులో ఎ2గా ప్రణీత్ రావు, ఎ3గా తిరుపతన్న, ఎ4గా భుజంగరావు , ఎ5గా రాధాకిషన్ రావు ఉన్నారు. ఈ నలుగురు ఇటీ వల దాఖలు చేసిన మ్యాండేటరీ బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి క్రిమినల్ కోర్టు తిరస్కరించిన విషయం విదితమే. అదేవిధంగా ఈ కేసులో అరెస్ట్ అయి చంచల్ గూడ జైలులో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై మరో కేసు నమోదు అయ్యింది.

నాంపల్లి కోర్టులో పీటీ వారెంట్‌పై పోలీ సులు రిమాండ్ చేశారు. యజమానిని కిడ్నాప్ చేసి క్రియా హెల్త్ కేర్ సంస్థలో కోట్ల విలువైన షేర్లను నలుగురు డైరెక్టర్ల మీదకు బలవంతంగా బదిలీ చేయించారని ఫిర్యాదులో వెల్లడించారు. సంస్థ వ్యవస్థాపకుడు చెన్నుపాటి వేణుమాధవ్ ఫిర్యా దుతో కేసు నమోదైంది. ఈ క్రమంలో రాధాకిషన్ రావుతో పాటు మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు సహా చంద్రశేఖర్, కృష్ణ, గోపాల్, రాజ్, రవి, బాలా జీలపై కేసు నమోదైంది. ప్రస్తుతం పరారీలో ఉన్న నింది తుల కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News