హైదరాబాద్: సంచలనం సృష్టించిన హాస్టల్ విద్యార్థి ప్రవళిక ఆత్మహత్యలో పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. ప్రవళికను శివరాం రాథోడ్ ప్రేమించి మోసం చేసి వేరే యువతిని వివాహం చేసుకునేందుకు సిద్ధం కావడంతోనే ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు శివ రాం రాథోడ్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. శివరాం రాథోడ్‌ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా కేసులో ఆధారాలు లేవని కోర్టు అదే రోజు బెయిల్ ఇచ్చింది.
దీంతో జైలు నుంచి విడుదలైన శివరాం ప్రవళిక ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అయితే చిక్కడపల్లి పోలీసులు శివారం రాథోడ్ బెయిల్ పిటిషన్‌ను రద్దు చేయాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా చిక్కడపల్లి పోలీసులు శివరాంపై కోర్టులో వేసిన పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకుంటున్నట్లు కోర్టుకు చెప్పారు. దీంతో కేసుపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.