లావణ్య ఫిర్యాదుతో మస్తాన్
సాయి, మరొకరి అరెస్టు
మస్తాన్‌సాయి హార్డ్‌డిస్క్‌లో 200
మంది యువతుల నగ్న
వీడియోలు, వాటితో బ్లాక్‌మెయిల్
మన తెలంగాణ/సిటీ బ్యూరో: సినీ నటులు రా జ్‌తరుణ్, లావణ్య కేసులో ఇద్దరు నిందితుల ను నార్సింగి పోలీసులు సోమవారం అరెస్టు చే శారు. గత నెల 31వ తేదీన రావి బావాజీ మ స్తాన్ సాయి, షేక్ ఖాన్ మోహిద్దిన్ ఇద్దరు కలిసి తన ఇంటికి వచ్చి బెదిరించారని, ఇం ట్లోని సిసిటివి, టివిని ధ్వంసం చేశారని రాజ్‌తరుణ్ ప్రియురాలు లావణ్య నార్సింగి పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. మస్తాన్ సాయి తనపై అత్యాచారం చేశాడని, రాజ్‌తరుణ్‌తో విడిపోవడానికి అతడే కారణమని లావణ్య గతంలో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత ఏడాది నవంబర్‌లో మస్తాన్ సాయి ఇంటికి వెళ్లిన లావణ్య అతడి ఇంట్లోని 4టిబి ఉన్న హార్డ్ డిస్క్‌ను తీసుకుంది.
ఇది తెలుసుకున్న మస్తాన్‌సాయి తన హార్డ్ డిస్క్ తిరిగి ఇవ్వాలని లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. దీంతో లావణ్య ప్రాణభయంతో స్నేహితుల ఇంట్లో ఉంది, అక్కడి నుంచే డయల్ 100 ద్వారా ఫోలీసులకు ఫిర్యాదు చేసి వారికి మస్తాన్‌సాయి హార్డ్ డిస్క్‌ను అందజేసింది. హార్డ్ డిస్క్‌లో పలువురి ఫోన్లు హ్యాక్ చేసి తీసుకున్న డాటా, వివాహితులు, అవివాహితుల న్యూడ్ ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి అమ్మాయిలకు మాయమాటలు చెప్పి డ్రగ్స్ అలవాటు చేసేవాడు, యువతులు మత్తులో ఉన్న సమయంలో వారితో శృంగారంలో పాల్గొనే వాడు. ఈ సమయంలో వీడియో తీసి వాటిని చూపించి యువతులను బ్లాక్‌మెయిల్ చేసేవాడు. యువతులతో వీడియోకాల్స్ మాట్లాడుతున్న సమయంలో వారిని నగ్నంగాచేసి రికార్డింగ్ చేసే బెదిరించేవాడని తెలిసింది.
ఈ విషయం తెలిసినా పరువు పోతుందని ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయనట్లు తెలిసింది. హార్డ్ డిస్క్‌లో యువతుల 200 వీడియోలు ఉన్నట్లు తెలిసింది. మస్తాన్ సాయిని గతంలో వరలక్ష్మి టిఫిన్స్ సెంటర్ డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ పోలీసులు కూడా అతనిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. లావణ్యకు సంబంధించిన కొన్ని వీడియోలను అతడు రికార్డ్ చేశాడని, ఆ వీడియోలను ఉపయోగించి మస్తాన్ సాయి ఆమెను బ్లాక్‌మెయిల్ చేసే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు.
వీడియోలతో బ్లాక్‌మెయిల్…
సినీ హీరో నిఖిల్, వరలక్ష్మి టిఫిన్స్ సెంటర్ అధినేత ప్రభాకర్ రెడ్డికి చెందిన ప్రైవేటు వీడియోలు సైతం మస్తాన్ సాయి హార్డ్ డిస్కులో ఉన్నట్లు లావణ్య తెలిపింది. మస్తాన్ సాయి ఇంటికి వెళ్లి హార్డ్ డిస్క్‌ను తీసుకొచ్చినట్లు లావణ్య పోలీసులకు వెల్లడించింది. హార్డ్ డిస్కులో వందలాది మంది నగ్న వీడియోలు ఉన్నాయని తెలిపింది. ట్రాప్ అయిన అమ్మాయిలకు మస్తాన్ సాయి డ్రగ్స్ ఇచ్చి వారిపై లైంగిక దాడికి పాల్పడేవారని చెప్పింది. యువతులు మత్తులో ఉన్న సమయంలో మస్తాన్ సాయి వారిపై లైంగిక దాడి చేసి వీడియోలను తీసేవాడని చెప్పింది. మస్తాన్ సాయిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు లావణ్య వెళ్తుండగా బెదిరించినట్లు తెలిసింది. లావణ్యపై అత్యాచారం చేసి ఆ వీడియోలు రికార్డ్ చేసిన మస్తాన్ తన వీడియోలు డిలీట్ చేయాలని అడిగిన లావణ్యపై దాడి చేసినట్లు తెలిసింది.
హీరో నిఖిల్ ఫోన్ హ్యాక్…
సినీ హీరో నిఖిల్ ఫోన్‌ను మస్తాన్‌సాయి హ్యాక్ చేసి అందులోని డాటా రికార్డు చేసుకున్నట్లు తెలిసింది. లావణ్య బట్టలు మార్చుకునే సమయంలో స్సై కెమెరాలు పెట్టి వీడియో తీసినట్లు తెలిసింది. బాధితులను బ్లాక్ మెయిల్ చేసి తన కోరిక తీర్చాలంటూ పలుమార్లు అనేక మంది యువతులపై మస్తాన్ సాయి లైంగిక దాడికి పాల్పడేవాడని తెలిసింది. పోలీసులకు లావణ్య ఇచ్చిన వీడియోలో ఉన్నది తన భార్య అని, కావాలనే లావణ్య తప్పుడు ప్రచారం చేస్తోందని మస్తాన్ సాయి అన్నారు. 2017లో తాము హనీమూన్‌కు వెళ్లినప్పుడు తీసుకున్న వీడియోలు హార్డ్ డిస్క్‌లో ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు ఉన్న హార్డ్ డిస్క్‌లో లావణ్యకు వ్యతిరేకంగా సాక్షాలు ఉన్నాయని, వాటిని మాయం చేసేందుకు లావణ్య హార్డ్ డిస్క్‌ను దొంగిలించిందని ఆరోపించాడు.