Thursday, January 16, 2025

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ట్విస్ట్

- Advertisement -
- Advertisement -

సంధ్య థియేటర్ తొక్కిసలాట సంఘటనలో మరో విషయం బయటికి వచ్చింది. డిసెంబర్ 4వ తేదీన పుష్ప2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చేందుకు తాము అనుమతి ఇవ్వలేదని చిక్కడపల్లి పోలీసులు కొత్త విషయం బయటపెట్టారు. తాము వచ్చేందుకు అనుమతి ఇవ్వకున్నా అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చి షో చేశారని పేర్కొన్నారు. దీంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతిచెందిందని పోలీసులు వెల్లడించారు. హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్న స్పెషల్ షోకు వస్తే విపరీతమైన క్రౌడ్ ఉంటుందని థియేటర్ యాజమాన్యానికి తాము ముందుగానే చెప్పామని తెలిపారు. వారిని తీసుకురావొద్దని యాజమాన్యానికి లెటర్ పంపామని తెలిపారు. అయినా పోలీసుల మాట వినకుండా సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చారని పేర్కొన్నారు.

ఆయన రావడమే కాకుండా అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టారని తెలిపారు. అతన్ని చూసిన అభిమానులు, ప్రేక్షకులు ఒక్కసారిగా థియేటర్‌లోకి దూసుకెళ్లారని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ్ సృహ కోల్పోయారని చిక్కడపల్లి పోలీసులు వెల్లడించారు. దీంతో బాధితులకు సీపీఆర్ చేసిన తర్వాత వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించామని తెలిపారు. చికిత్సపొందుతూ రేవతి మృతిచెందినట్లు వెల్లడించారు. ఆమె మృతి గురించి తెలిసిన వెంటనే అల్లు అర్జున్‌ను థియేటర్ నుంచి తాము బయటకు పంపించినట్లు పోలీసులు తెలిపారు. అయితే అల్లు అర్జున్ వెళ్లేపోయే సమయంలో కూడా కారు ఎక్కి మళ్లీ ర్యాలీ ద్వారా అభిమానులకు అభివాదం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. రిమాండ్ వాదనల సమయంలోనూ ఇదే అంశాన్ని నాంపల్లి కోర్టుకు తెలియజేసినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News