Thursday, January 23, 2025

ఎపి ఎంఎల్‌సి కేసులో మరో ట్విస్ట్

- Advertisement -
- Advertisement -

subramanyam murder case

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెత్ సర్టిఫికెట్ పై మరో వివాదం చెలరేగింది. వాస్తవంగా సుబ్రహ్మణ్యం హత్య కాకినాడలోనే చేసినట్లు ఎంఎల్‌సి అనంతబాబు పోలీసులు ముందు వాంగ్మూలమిచ్చాడు. అయితే డెత్ సర్టిఫికెట్ గొల్లల మామిడాడ లో ఇవ్వాలని గొల్లలమామిడాడ పంచాయతీ సెక్రెటరీపై ఉన్నత అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. గొల్లల మామిడాడ లో కేవలం సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు మాత్రమే జరిగాయి. పెదపూడి ఎంఆర్‌వొ మాత్రం గత నాలుగు రోజులుగా పంచాయతీ సెక్రెటరీని డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలని అడుగుతున్న ఇవ్వడం లేదని ఎంఆర్‌వొ ఆర్‌డివొకి రాసిన లెటర్ బయటపడింది. డెత్ ఎక్కడ జరిగితే అక్కడే డెత్ సర్టిఫికెట్ ఇస్తారు. అయితే గొల్లలమామిడాడ పంచాయతీ సెక్రెటరీ అడగడం వెనుక కుట్ర కోణం దాగి ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. కేసు మాఫీలో భాగంగానే ఇది జరుగుతుందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News