Sunday, December 22, 2024

సూర్యాపేట మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానంలో ట్విస్టులు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మాణాల జోరు కొనసాగుతోంది. సూర్యాపేట జిల్లా కేంద్ర పురపాలక సంఘంలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా ట్విస్టుల పర్వం కొనసాగుతోంది. రెబెల్ కౌన్సిలర్లు ఇంతవరకు సమావేశానికి హాజరు కాలేదు. కాగా కలెక్టర్ వెంకట్రావు మాత్రం ఉదయం 11 గంటలకే సూర్యాపేట మున్సిపల్ సమావేశానికి చేరుకున్నారు. అవిశ్వాస తీర్మానానికి ఒక్క సభ్యుడు కూడా హాజరు కాకపోవడంతో షాక్ అయ్యారు.

అటు హైదరాబాద్ శివారులోని ఓ కన్వెన్షన్ లో కౌన్సిలర్లతో ఓ కాంగ్రెస్ ఎంఎల్ఏ మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. నిన్నటివరకు అవిశ్వాసం నెగడానికి 32 మంది కౌన్సిలర్ల మద్దతు కావాల్సింది. రాత్రి నుంచి కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా వెనక్కి తగ్గారు. అవిశ్వాసానికి కావలసిన కోట లేకపోవడంతో.. సంప్రదింపులు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రత్యేక సమావేశాన్ని కలెక్టర్ వెంకట్రావు వాయిదా వేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News