Monday, December 23, 2024

ట్విట్టర్‌కు ఎలాన్ మస్క్ కిక్!

- Advertisement -
- Advertisement -

ఆచితూచి మాట్లాడటం అనేది ఎలాన్ మస్క్ డిక్షనరీలోనే లేదు. ఆ టైమ్‌కు ఏది కరెక్ట్ అనిపిస్తే అలాగే మాట్లాడతారు. వెనకా ముందు ఆలోచించడం మస్క్ మహాశయుడికి చేతకాదు. ఇప్పటికైతే ఎలాన్ మస్క్ ఓ వ్యాపార దిగ్గజం. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న కార్పొరేట్ అధినేత. అయితే ఆయన జీవితంలో బోలెడు పరాజయాలున్నాయి. జీవితపు తొలి రోజుల్లో ఎలాన్ ఒక ఫెయిల్యూర్. ఒక దాని వెంట మరొకటిగా పరాజయాలు ఆయన జీవితంలో తరుముకుంటూ వచ్చాయి. అయినా ఎలాన్ మస్క్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరించు కుంటూ జీవితంలో దూసుకువెళ్లాడు ఎలాన్ మస్క్.

ఎలాన్ మస్క్ పరిచయం అక్కర్లేని పేరు. అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం. ఆయన ఏం చేసినా సంచలనమే. ఎలాన్ మస్క్ ఎప్పుడూ వివాదాల్లోనే ఉంటారు. టెస్లా కంపెనీ సిఇఒగా ప్రపంచ మంతటా ఆయన పాపులర్. కిందటేడాది అక్టోబరులో ప్రపంచం లోనే అతి పెద్ద సోషల్ మీడియా వేదిక ట్విట్టర్‌ను ఆయన కొనుగోలు చేశారు. అప్పటి నుంచి మస్క్ మరింతగా వివాదాల్లో కూరుకు పోయారు. ట్విట్టర్‌లో ఎలాన్ మస్క్ అనేక కీలక మార్పులు చేశాడు. కొన్ని రోజుల కిందట ట్విట్టర్ ఐడెంటిటీని మార్చేశారు. బ్లూ బర్డ్ లోగోను మార్చి వేసి ఆ స్థానంలో కుక్కపిల్లను పెట్టారు. తాజాగా ట్విట్టర్ యూజర్లకు ఎలాన్ మస్క్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ట్విట్టర్ యూజర్లు తాము పోస్ట్ చేసే కంటెంట్ నుంచి నాలుగు డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చారు.

ఇంటర్నేషనల్ కార్పొరేట్ దిగ్గజం ఎలాన్ మస్క్ చేతుల్లో పడ్డాక ట్విట్టర్‌లో అనేక మార్పులు జరుగుతున్నాయి. తాజాగా ట్విట్టర్ యూజర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. యూజర్లు తమ కంటెంట్ నుంచి డబ్బులు సంపాదించుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు ఎలాన్ మస్క్. సుదీర్ఘ సమాచారం నుంచి ఎక్కువ నిడివి కలిగిన వీడియోల వరకు దేనికైనా సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌ను పెట్టుకోవచ్చని మస్క్ వెల్లడించారు. కంటెంట్ క్రియేట ర్లు తమ వీడియోలకు సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌ను పెట్టుకోవచ్చని మస్క్ వెల్లడిం చారు. వాటి ద్వారా సొమ్ములు సంపాదించు కోవచ్చన్నా రు. అయితే ట్విట్టర్ యూజర్లకు ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ ప్రస్తుతం అమెరికా వరకే పరిమితం. అయితే త్వరలో మిగతా దేశాలకు కూడా విస్తరిస్తామన్నారు ఎలాన్ మస్క్.

కార్పొరేట్ దిగ్గజం ఎలాన్ మస్క్ తాజా నిర్ణయం వెనుక ఓ వ్యూహం ఉండి ఉండొచ్చంటున్నారు టెక్ నిపుణులు. కంటెంట్ క్రియేటర్లను ట్విట్టర్‌లోకి ఆహ్వానించడానికే మస్క్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటున్నారు. అలాగే కంటెంట్ నుంచి సొమ్ము లు సంపాదించుకునే ఆప్షన్‌ను యూజర్లకు కల్పించడం ద్వారా ప్రముఖ న్యూస్ లెటర్ సంస్థ సబ్ స్టాక్‌కు పోటీనివ్వడం కూడా మస్క్ వ్యూహం అయిఉండొచ్చంటున్నారు టెక్ నిపుణులు. ట్విట్టర్ ఐడెంటిటీని ఎలాన్ మస్క్ మార్చేశారు. చాలా కాలం పాటు నీలిరంగు పిట్ట ట్విట్టర్ లోగోగా ఉండేది. అయితే కొన్ని రోజుల కిందట బుల్లిపిట్టను తరిమేసి ఓ కుక్కపిల్ల లోగో స్థానం లోకి వచ్చింది. ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఈ మేరకు అకస్మాత్తుగా ఓ నిర్ణయం తీసుకున్నారు.

ట్విట్టర్‌లో సౌదీ ప్రముఖుల పెట్టబడులు?
ట్విట్టర్ కొనుగోలు చేసినప్పటి నుంచీ ఎలాన్ మస్క్ పేరు మీడియాలో హల్‌చల్ అవుతోంది. ఎంతగా హల్‌చల్ అవుతుందో, అంతగా వివాదాస్పదం కూడా అవుతోంది. ఎలాన్ మస్క్‌కు ఇతర దేశాలతో ఉన్న వ్యాపార సంబంధాలపై డేగకన్ను వేయాల్సిన అవసరం ఉందని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కామెంట్ చేశారు. ట్విట్టర్ కొనుగోలు విషయంలో సౌదీఅరేబియకు చెందిన కొందరు ప్రముఖులు ఎలాన్ మస్క్‌కు అండగా పెట్టుబడులు పెట్టారన్న వార్తలు మీడియాలో హల్‌చల్ చేశాయి. దీనిపై అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ స్పందించారు. మస్క్ వ్యాపార సంబంధాల నేపథ్యంలో అమెరికాకు భద్రతపరంగా ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా అనే అంశాన్ని పరిశీలించాల్సి ఉందని జో బైడెన్ అన్నట్లు వార్తలొచ్చాయి.

ఎలాన్ మస్క్ తాను అనుకున్నది చేసే రకం. పరిణామాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని ఏమాత్రం పట్టించుకోరు. ట్విట్టర్ కొనుగోలు చేయాలని ఎలాన్ మస్క్ ఎప్పట్నుంచో అనుకున్నార ట. అయితే ట్విట్టర్‌లోని కొంత మంది ఉన్నతాధికా రులకు తమ సంస్థను ఎలాన్ మస్క్ కొనడం ఇష్టం లేదట. ఈ నేపథ్యంలో ట్విట్టర్ డీల్ లేటయ్యింది. ట్విట్టర్ తన చేతుల్లోకి రాగానే సంబంధిత డీల్ లేట్ అవడానికి కారణమని భావించిన కొంత మంది ఉన్నతాధికారుల ను ఎలాన్ మస్క్ అప్పటికప్పుడు ఇంటికి పంపారు. వర్క్ ఫ్రం హోమ్ విషయంలోనూ ఎలాన్ మస్క్ చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరిం చారన్న పేరుంది. కరోనా తీవ్రత తగ్గిన నేపథ్యంలో టెస్లా ఉద్యోగులు కూడా ఆఫీసులకు వచ్చి చేయాల్సిందేనని ఎలాన్ మస్క్ హుకుం జారీ చేశారు. ఆఫీసుకు రాలేని వాళ్లు, ఎంచక్కా ఉద్యోగాలు మానేయవచ్చన్నారు.

ఎలాన్ మస్క్‌ది భిన్నమైన వ్యక్తిత్వం
ఆచితూచి మాట్లాడటం అనేది ఎలాన్ మస్క్ డిక్షనరీలోనే లేదు. ఆ టైమ్‌కు ఏది కరెక్ట్ అనిపిస్తే అలాగే మాట్లాడతారు. వెనకా ముందు ఆలోచించడం మస్క్ మహాశయుడికి చేతకాదు. ఇప్పటికైతే ఎలాన్ మస్క్ ఓ వ్యాపార దిగ్గజం. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న కార్పొరేట్ అధినేత. అయితే ఆయన జీవితంలో బోలెడు పరాజయాలున్నాయి. జీవితపు తొలి రోజుల్లో ఎలాన్ ఒక ఫెయిల్యూర్. ఒక దాని వెంట మరొకటిగా పరాజయాలు ఆయన జీవితంలో తరుముకుంటూ వచ్చాయి. అయినా ఎలాన్ మస్క్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరించు కుంటూ జీవితంలో దూసుకువెళ్లాడు ఎలాన్ మస్క్. తన ఈడు పిల్లలతో కలిసేవాడు కాదు.

ఎప్పుడూ ఒంటరిగా కూర్చునేవాడు. బాల్యంలో తోటి పిల్లలతో కలిసేవాడు కాదు. ఆకాశం వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తున్నట్లు ఉండేవాడు. పరధ్యానానికి కేరాఫ్ అడ్రస్‌లా ఉండేవాడు. ఇంట్రావర్ట్‌గా ఉన్న ఎలాన్ మస్క్ మనస్సులో బాధ తొలగించుకో వడానికి వీడియో గేమ్స్‌కు అలవాటుపడ్డాడు. కొంత కాలం బాగానే సాగింది. ఆ తరువాత ఎవరో డిజైన్ చేసిన వీడియో గేమ్స్ నేను ఆడటమేమిటి? అని డిసైడ్ అయ్యాడు. తన క్రియేటివిటీతో బ్లాస్టర్ అనే ఒక సరికొత్త వీడియో గేమ్‌ను రూపొందించాడు. పెన్సిల్వేనియాలో చదువు తరువాత సోదరుడి తో కలిసి ‘జిప్ 2’ అనే కంపెనీ స్థాపించాడు. జిప్2 మార్కెట్‌లో మంచి పేరు తెచ్చుకుంది. 1999లో జిప్ 2 సంస్థను ప్రముఖ కంప్యూటర్ సంస్థ కాంపాక్ 307 మిలియన్ డాలర్లకు కొనుక్కొంది. కానీ అందులో కేవలం ఏడు శాతం మాత్రమే ఎలాన్ చేతికి దక్కింది.

అయితేనేం! సాఫ్ట్‌వేర్ మజాను ఎలాన్‌కు రుచి చూపించింది. టెస్లా, స్పేస్ ఎక్స్, ఈ రెండు సంస్థలు ఎలాన్ మస్క్‌ను ఎక్కడికో తీసుకెళ్లాయి. టెస్లా గ్రూప్ కింద ఎలెక్ట్రిక్ కార్లు రూపొందించడా నికి ఎలాన్ మస్క్ నిద్రాహారాలు లేకుండా శ్రమించాడు. టెస్లా కారును ప్రమోట్ చేయడానికి.. అడ్వర్టయిజ్ మెంట్లపైన డాలర్ కూడా ఆయన ఖర్చుపెట్టడు. మన ప్రాడక్టే మాట్లాడాలి అంటాడు టెస్లా కంపెనీ అధినేత. కార్లే కాదు… అంతరిక్షమన్నా ఆయనకు బోలెడు ఆసక్తి. తన ఆలోచనలకు అనుగుణంగా స్పేస్ ఎక్స్ సంస్థను ఆయన ప్రారంభించారు. స్పేస్ ఎక్స్‌తో అంతరిక్షంలోకి అడుగుపెట్టారు ఎలాన్ మస్క్. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఎలాన్ మస్క్ పేరు మార్మోగింది. ఆయనకు సెలవలంటే పడదు. ఎప్పుడూ పనిలోనే, ఆనందం వెతుక్కునే వ్యక్తి మస్క్ మహాశయు డు. నిద్ర కూడా తక్కువే. ఒక్కసారి అలా సీట్లో కూర్చోగానే పని రాక్షసుడైపోతాడు. ఏదిఏమైనా ఎలాన్ మస్క్ ఒక వివాదాస్పద కార్పరేట్ దిగ్గజం. పరాజయాలనే పునాదిగా చేసుకుని జీవితంలో అనేక విజయాలు సాధించిన సక్సెస్ స్టోరీ ఎలాన్ మస్క్‌ది.

ఎస్.అబ్దుల్ ఖాలిక్
6300174320

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News