Friday, December 20, 2024

ట్విట్టర్ సీఈవోగా ఎలాన్ మస్క్ వద్దంటూ 57శాతం నెటిజన్లు ఓటింగ్..

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాను ట్విట్టర్ సిఈవోగా ఉండాలా? వద్దా? అంటూ నెటిజన్లను ప్రశ్నించారు. ఈమేరకు నిర్వహించిన పోల్‌లో మెజార్టీ వినియోగదారులు ఈ ప్రతిపాదనకు అనుకూలంగా స్పందించారు. మొత్తం 17 మిలియన్ ఓటర్లలో 57.5 శాతం మంది సీఈవో పదవి నుంచి తప్పుకోవాలని తమ అభిప్రాయం వెల్లడించగా, తప్పుకోవద్దు ఉండాలని 42.5 శాతం మంది వెల్లడించారు. 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్‌ను మస్క్ చేజిక్కించుకున్న తరువాత అనేక వివాదాస్పదమైన విధానాలను ప్రవేశ పెట్టారు.

ట్విట్టర్‌లో అనేక ప్రముఖ జర్నలిస్టుల అకౌంట్లను రద్దు చేయడం మీడియా లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. యూరోపియన్ యూనియన్, అమెరికా తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో మళ్లీ జర్నలిస్టుల ఖాతాలను మస్క్ పునరుద్ధరించ వలసి వచ్చింది. మెజార్టీ అభిప్రాయం ఎంతవరకు మస్క్ పరిగణన లోకి తీసుకుంటారో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News