Monday, December 23, 2024

ఆ కార్టూన్ ఏ మతాన్ని ఉద్దేశించింది కాదు

- Advertisement -
- Advertisement -

Twitter deleted cartoon tweeted by BJP Gujarat unit

 

అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లో 2008లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో 38మందికి మరణశిక్ష విధిస్తూ ప్రత్యే కోర్టు వెలువరించిన తీర్పుపై బిజెపి గుజరాత్ విభాగం ట్వీట్ చేసిన కార్టూన్‌ను ట్విటర్ తొలగించిన దరిమిలా అసలైన ఫోటోలను ఆధారం చేసుకునే ఈ కార్టున్ ఉందని, ఏ ఒక్క మతాన్ని ఉద్దేశించి ఇది లేదని అధికార బిజెపి సోమవారం తెలియచేసింది. కాగా, ఈ కార్టూన్‌ను తొలగించాలన్న ట్విటర్ నిర్ణయాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్, కొందరు సామాజిక కార్యకర్తలు ప్రశంసించారు. ప్రత్యేక కోర్టు తీర్పును అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. గడ్డాలతో ఉన్న కొందరు వ్యక్తులు తెల్ల టోపీలు ధరించి ఉరితాడుకు వేళ్లాడుతున్నట్లు ఈ కార్టూన్‌లో చిత్రంచారు. త్రివర్ణ పతాకం, బాంబు పేలుడు దృశ్యాన్ని నేపథ్యంలో చిత్రించారు. పైన కుడి వైపున సత్యమేవ జయతే అన్న అక్షరాలు రాశారు. గుజరాత్ బిజెపి అధికారిక ట్విటర్ హ్యాండిల్‌పై శనివారం ఈ కార్టూన్‌ను పోస్ట్ చేశారు. ప్రత్యేక కోర్టు తీర్పు వెలువడిన మరుసటి రోజున ఈ కార్టూన్ దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ కార్టూన్ గుజరాత్ బిజెపి శాఖకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్ సోషల్ మీడియా పేజీలలో కనిపించడం లేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News