Friday, December 20, 2024

ఎలాన్ మస్క్‌పై ట్విట్టర్ మాజీ సిఇఒ పరాగ్ దావా

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత వేటుకు గురైన కంపెనీ మాజీ సిఇఒ పరాగ్ అగర్వాల్ మరో ఇద్దరు ఉద్యోగులు కంపెనీపై దావా వేశారు. మిగతా ఇద్దరిలో మాజీ లీగల్ హెడ్ విజయ గద్దె, మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెహగల్‌లు ఉన్నారు. 1 మిలియన్ డాలర్లకు పైగా చెల్లించని చట్టపరమైన బిల్లుల కోసం ట్విట్టర్‌పై దావా వేసినట్టు సమాచారం. గత ఏడాది అక్టోబర్‌లో ఎలోన్ మస్క్ అగర్వాల్, గద్దె, సెహగల్‌ను తొలగించారు. యుఎస్‌లోని డెలావేర్ చాన్సరీ కోర్టులో దాఖలు చేసిన తాజా వ్యాజ్యం ప్రకారం, ట్విట్టర్ తమకు 1 మిలియన్ డాలర్లకు పైగా చెల్లించాల్సి ఉందని ముగ్గురు ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News