Monday, December 23, 2024

ట్విట్టర్ ఇప్పుడు తెలివైన వ్యక్తి చేతుల్లో ఉంది : ట్రంప్

- Advertisement -
- Advertisement -

Twitter is now in the hands of a wise man : Trump

న్యూయార్క్ : ట్విట్టర్‌ను మస్క్ హస్తగతం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్పందన తెలిపారు. ఈమేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు పెట్టారు. ట్విట్టర్ ఇప్పుడు తెలివైన వ్యక్తి చేతుల్లో ఉంది. దీంతోపాటు అమెరికాను ద్వేషించే ర్యాడికల్ లెఫ్ట్ ఉన్మాదుల నిర్వహణ నుంచి బయటకు వచ్చింది. ఈ విషయాలపై చాలా సంతోషంగా ఉంది. సంస్థను తీవ్రంగా దెబ్బతీసిన నకిలీ ఖాతాలు, ఇతరత్రా కార్యకలాపాలను వదిలించుకోడానికి ట్విట్టర్ కృషి చేయాలన్నారు. అయితే ఆయన ట్విట్టర్ లోకి తిరిగి వస్తారో లేదో మాత్రం వెల్లడించలేదు. 2021 జనవరిలో అగ్రరాజ్యం లోని క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌పై ట్విట్టర్ శాశ్వతంగా నిషేధం విధించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News