Monday, December 23, 2024

మారిన ట్వట్టర్ లోగో..

- Advertisement -
- Advertisement -

లండన్: ట్విట్టర్ నీలి పక్షి స్థానంలో నలుపు, తెలుపు రంగుల కలయికతో కూడిన కొత్త లోగో ‘ఎక్స్’ను ప్రపంచ సంపన్నుడు, ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ ఆవిష్కరించారు. 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన మస్క్ పక్షి లోగోను తనకు ఇష్టమైన ‘ఎక్స్’ ఆంగ్ల వర్ణమాల తో మార్పు చేశాడు. ఇప్పుడు హోమ్ ఆన్ ట్విటర్ బదులు ఎక్స్ వస్తోంది. డెస్క్‌టాప్ వెర్షన్ ఎక్స్ కనిపిస్తోంది, కానీ ఫోన్ యాప్‌లో ఇప్పటికీ పక్షి దర్శనమిస్తోంది. లోగో ఆలోచనల గురించి అభిమానులు మస్క్ అడిగారు, ఆ తర్వాత ఎక్స్ లోగో వైపు ఆయన మొగ్గుచూపడం, అదే కొనసాగుతుందని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఎక్స్.కామ్ వెబ్‌సైట్‌ను సందర్శించినప్పుడు ట్విట్టర్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతోంది.

ఎక్స్.కామ్ నుండి ట్విట్టర్. కామ్‌కి వెళుతోంది. ఎలోన్ మస్క్ 2 నెలల క్రితం ట్విట్టర్‌కి కొత్త సిఇఒగా లిండా యాకారినోను నియమించారు. మస్క్ ట్విట్టర్ మాతృ సంస్థకు ఎక్స్ కార్ప్ అని పేరు పెట్టనున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు ఎట్టకేలకు ఈ పనిని పూర్తి చేశారు. ఇప్పుడు ట్విట్టర్ ప్రధాన కార్యాలయం నుండి పాత లోగో తొలగించి, దాని స్థానంలో ఎక్స్ అక్షరంతో చేసిన కొత్త లోగోను ఇన్‌స్టాల్ చేశారు. దీని చిత్రాలు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్నాయి. ఎలోన్ మస్క్ కి ఇంగ్లీష్ వర్ణమాల ఎక్స్ అక్షరంతో అనుబంధం దాదాపు 25 ఏళ్ల నాటిది. ఎలోన్ మస్క్ టెస్లా, స్పేస్‌ఎక్స్‌తో విజయ శిఖరాన్ని తాకడానికి చాలా కాలం ముందే ఎక్స్ తో తన వ్యవస్థాపక ప్రయాణాన్ని ప్రారంభించాడు. 1999లో ఆయన ఎక్స్. కామ్ అనే ఆన్‌లైన్ బ్యాంక్‌ను ప్రారంభించగా, అది తర్వాత పేపాల్‌తో విలీనమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News